అక్కినేని అంటే దేవదాసు.. దేవదాసు అంటేనే అక్కినేని.. తన పేరును అల సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించుకున్నారాయన. 1953 అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ప్రధానపాత్రలుగా దేవదాసు చిత్రం తెరకెక్కింది. ప్రముఖ బెంగాలీ రచయత శరత్ చంద్ర తన 16వ యేట ‘దేవదాసు’ నవలను రచించాడు. ఆ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డి.యల్.నారాయణ నిర్మించారు.
దేవాదాసు పాత్రకు అక్కినేని పనికిరారని, తీసేయ్యమని చాలామంది నిర్మాతలు డీఎల్ నారాయణ, దర్శకుడు వేదాంతం రాఘవయ్యలకు సలహా ఇచ్చారట. కానీ వారు ఎవర్నీ లెక్క చెయ్యకుండా అక్కినేనితోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భగ్న ప్రేమికులుగా అక్కినేని-, సావిత్రిల నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సీ.ఆర్. సుబ్బురామన్ సంగీతం, ఘంటసాల గాత్రం సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది.
అయితే ఈ సినిమాలో ‘జగమే మాయ బ్రతుకే మాయ’ పాటలో అక్కినేని నటించారు అనడం కన్నా జీవించారనే చెప్పాలి. ఈ పాటలో అక్కినేని నిజంగా తాగి నటించారన్న ప్రచారం బాగా నడించింది. వాస్తవానికి ఏం జరిగిదంటే.. ఈ సినిమా దర్శకుడైన వేదాంతం రాఘవయ్య ఈ సినిమా షూటింగ్ ను ఎక్కువభాగ రాత్రుళ్ళే చేశారు. దీని వలన అక్కినేనికి సరైన నిద్రలేక కళ్ళు ఉబ్బెత్తుగా తయారయి తాగుబోతులాగా సహజంగా కనిపించారు.
మరిన్ని విశేషాలు…
భగ్న హృదయుడి పాత్ర పై అక్కినేని ఇప్పటికీ చెక్కు చెదరని ముద్ర వేశారు
.1971 లో విడుదలైన (ప్రేమనగర్), 1981 లో విడుదలైన (ప్రేమాభిషేకం) లో కూడా భగ్నహృదయుడిగా అక్కినేనే నటించటం, ఆ పాత్రలు మరల దేవాదాసుని గుర్తుచేస్తాయి.
యావత్ భారతదేశంలో భగ్నహృదయులైన వారిని సరదాకి దేవదాసుగా వ్యవహరిస్తుంటారు
ఈ సినిమా 100 డేస్ పంక్షన్ ను హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిపారు. అక్కినేని, ఎన్టీఆర్, సావిత్రి, వాణిశ్రీ వంటి తెలుగు సినీప్రపంచపు అతిరథ మహారథులందరూ ఆ వేడుకకు హాజరయ్యారు.