ఎస్పీ బాలు అందుకున్న తొలి రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

తన సుమధుర గానంతో సంగీతాన్ని జనానికి దగ్గర చేర్చిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఒడిశా, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, భోజ్‌పురి..ఇలా దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ ఆయన అభిమానులు ఉన్నారు. 40 వేలకు పైగా పాటలు పాడారు. ఎస్పీ బాలు పాడినన్ని భాషలు.. ఇప్పట్లో మరో గాయకుడు అందుకోలేడు.మరి అలాంటి గాయకుడు అందుకున్న తొలి రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’చిత్రానికి రూ.300 రెమ్యునరేషన్‌ఇచ్చారని, అదే తాను అందుకున్న తొలి రెమ్యురేషన్‌ అని బాలు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ రోజుల్లో ఘంటసాలగారు 500 రూపాయలు తీసుకునేవారని తెలిపారు . ‘ఏమి ఈ వింత మొహం’ పాటను కోదండపాణి వారం రోజులపాటు బాలుతో ప్రాక్టీసు చేయించారు. చివరకు అది సోలో పాట కాదని నలుగురు కలిసి పాడేదని తెలిసింది. అలా పి.సుశీల, కల్యాణం రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్‌తో కలిసి బాలు పాడిన తొలిపాట 1966న డిసెంబరు 15న విజయా గార్డెన్స్‌లో రికార్డిస్ట్‌ స్వామినాథన్‌ ఆధ్వర్యంలో రికార్డయింది

తొలి రెమ్యునరేషన్‌ అందుకున్నాక అందులో వాళ్ల నాన్న నెలకు 80 రూపాయలు పంపానని వెల్లడించారు. ఇక మిగిలిన డబ్బుతో తాను తన ఫ్రెండ్‌ మురళి డ్రైవిన్‌ వుడ్‌ల్యాండ్స్‌కి వెళ్లి చక్కగా గులాబ్‌జామూన్‌, మసాలాదోశ తిన్నామని వెల్లడించారు. ఇక తెలుగు తరువాత తాను కన్నడలో పాట పాడనని దానికి 150 రూపాయలు రెమ్యునరేషన్‌ ఇచ్చారని బాలు చెప్పుకొచ్చారు. అప్పట్లో పెద్ద రెమ్యునరేషన్‌ 500 రూపాయలను తాను చెక్‌ రూపంలో అందుకున్నానని చెప్పుకొచ్చారు బాలు.

1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన బాలు… ఆ తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో కూడా నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలగు చిత్రాల్లో ఆయన నటించారు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు తన గాత్రాన్ని దానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసారు బాలు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here