ఒక్క బ్లాక్ బ్లాస్టర్.. ఆ తరువాత 17 సినిమాలు వరుసగా ప్లాప్

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా అల్లూరి సీతారామరాజు. ఈ సినిమాలో కృష్ణ సరసన విజయనిర్మల హీరోయిన్ గా నటించగా జగ్గయ్య రూథర్ ఫర్డ్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో కొంతభాగానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించి మరణించగా, మిగిలిన చిత్రానికి కృష్ణ, పోరాట సన్నివేశాలకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించి పూర్తిచేశారు.

అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని రూపొందించిన ఈ చిత్రాన్ని ఘట్టమనేని హనుమంతరావు, ఆదిశేషగిరిరావు నిర్మించారు. ఈ సినిమాను కలర్ సినిమాస్కోప్ లో చిత్రీకరించారు, ఇది తెలుగులో మొట్టమొదటి కలర్ స్కోప్ సినిమాగా నిలిచింది. అల్లూరి సినిమా వచ్చాక కృష్ణ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. జనం థియేటర్లకు పోటెత్తారు. కలెక్షన్ల వర్షం కురిసింది.

ఈ చిత్రాన్ని విడుదల అయిన చాలా కాలం తరువాత సీనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని చూసి దీనిని ఇంతకంటే గొప్పగా తీయలేరు, ఆ పాత్రను ఇంతకంటే గొప్పగా పోషించలేరు అని కృష్ణను మెచ్చుకున్నారట. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో కృష్ణ కొత్త సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా తరువాత కృష్ణ చేసిన 17 సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి.

మనుషులు మట్టిబొమ్మలు, రాధమ్మ పెళ్లి, గౌరీ, ఆడంబరాలు అనుబంధాలు. దీర్ఘసుమంగళి, ధనవంతులు గుణవంతులు, ఇంటింటి కథ, సత్యానికి సంకెళ్లు, దేవదాసు, అభిమానవతి, కొత్తకాపురం, సౌభాగ్యవతి, చీకటివెలుగులు, రక్త సంబంధాలు, సంతానం సౌభాగ్యం, గాజుల కిష్టయ్య, దేవుడి లాంటి మనిషి ఇలా వరుసగా పదిహేడు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.1976లో పాడి పంటలు హిట్టయ్యే దాకా ఇదే పరిస్థితి కొనసాగింది.

అల్లూరి సీతారామరాజు ప్రీమియర్ చూసాక విజయ చక్రపాణి గారు కృష్ణతో మాట్లాడుతూ ఈ సినిమా అయ్యాక నిన్ను కొన్నాళ్ళు మామూలు పాత్రల్లో ప్రేక్షకులు చూడరని దానికి సిద్దపడమని జోస్యం చెప్పారట. ఆయన అన్నట్టు రెండేళ్లు కృష్ణకు విజయం దూరమైపోయింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here