ఒకే టైటిల్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు కొట్టుకున్న విషయం మీకు తెలుసా.. అవును ఈ సందర్భం తెలుగు ఇండస్ట్రీలో ఓ సారి జరిగింది. 1987లో సూపర్ స్టార్ కృష్ణ తన పెద్ద కుమారుడు రమేష్ బాబుని హీరోగా లాంచ్ చేయాలని అనుకున్నారు. అందుకు దర్శకుడిగా వి.మధుసూదనరావును ఎంచుకున్నారు. పద్మాలయా స్టూడియోస్ పతాకంపై ఈ సినిమా నిర్మించాలని అనుకున్నారు. ఈ సినిమాకు సామ్రాట్ అనే టైటిల్ అనౌన్స్ చేస్తూ ప్రకటన కూడా చేశారు.
సరిగ్గా అదే సమయంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన సినిమాకు కూడా ఇదే టైటిల్ పెట్టారు. దీనికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకుడు. రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కావడంతో టైటిల్ మాదంటే మాదని ఎక్కడా కూడా తగ్గలేదు. ఇరు వర్గాలు కోర్టు దాకా వెళ్లాయి. చివరకు సామ్రాట్ టైటిల్ రమేశ్ బాబుకు దక్కింది. ఇక బాలకృష్ణ సినిమాకు సాహస సామ్రాట్ అనే టైటిల్ ను పెట్టుకున్నారు. అయితే రమేశ్ బాబు నటించిన సామ్రాట్ సూపర్ హిట్ కాగా.. బాలయ్య నటించిన సాహస సామ్రాట్ పరాజయం పాలైంది.
1987, అక్టోబరు 2న విడుదలైన సామ్రాట్ చిత్రంలో సోనమ్ హీరోయిన్ గా నటించింది. బప్పి లహరి సంగీతం అందించాడు. ఇక రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన సాహస సామ్రాట్13 ఏప్రిల్ 1987లో రిలీజైంది. ఇందులో బాలకృష్ణ సరసన విజయశాంతి హీరోయిన్ గా నటించగా, చక్రవర్తి సంగీతం సమకూర్చారు.