ఇండస్ట్రీలో వారసత్వం అనేది ఒక్క సినిమాకే పనిచేస్తుంది. ఆ తరువాత మేకర్స్ అయిన ప్రేక్షకులైన టాలెంట్ ఉంటేనే ఎంకరేజ్ చేస్తారు. లేకపోతే పట్టించుకోరు. అందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. పెళ్లి సందడి సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో శ్రీకాంత్ తన తమ్ముడు అనిల్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారు.
అందులో భాగంగా 1999లో తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన విజయ్ ‘కాదలిక్కు మరియాదై’ని తెలుగులో ‘ప్రేమించేది ఎందుకమ్మా’ పేరుతో రీమేక్ చేయించాడు. ఈ సినిమాలో అనిల్ సరసన గులాబి సినిమాతో యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న మహేశ్వరిని హీరోయిన్ గా తీసుకున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సినిమాకు మరో ప్లస్ అనే చెప్పాలి.
.
సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాయగా, గణేష్ పాత్రో మాటలు రాశారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, శ్రీహరి లాంటి అగ్రనటులు ఈ సినిమాలో నటించారు. జాన్ మహేంద్రన్ ఈ సినిమాకు డైరెక్టర్. 1999 అక్టోబరు 8న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట వరకు ఓపెనింగ్ బాగానే తెచ్చుకున్న ఈ చిత్రం ఆ తరువాత దారుణంగా బోల్తా కొట్టింది.
ఈ సినిమా దెబ్బకు అనిల్ తో సినిమా తీసేందుకు ఇంకో నిర్మాత ముందుకు రాలేదు. నటన కూడా అంతంత మాత్రంగా ఉండటంతో శ్రీకాంత్ కూడా పాపం ఏం చేయలేకపోయాడు.