టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లలో అనుపమ పరమేశ్వరన్, సమంత రూత్ ప్రభు ఉంటారు. నటన పరంగా ఇద్దరు ఇద్దరే. ఏం మాయ చేశావే సినిమాతో సమంత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తే.. అ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అనుపమ. అతికొద్ది కాలంలోనే వీరిద్దరూ టాప్ ప్లేస్ లోకి చేరుకున్నారు.
అయితే ఓ రెండు సినిమాలకు మాత్రం అనుపమను అనుకొని చివరికి సమంతను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ రెండు సినిమాలు సమంత క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ఇంతకీ అవేంటి అంటే?
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా ముందుగా అనుపమను అనుకున్నారు సుకుమార్.. ఫోటో షూట్ కూడా చేశారు.. ఆ తరవాత ఏమైందో ఏమో కానీ సమంతను హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో అనుపమకు సుకుమార్ తన నిర్మాణంలో తెరకెక్కిన 18 పేజీస్ లో అవకాశం ఇచ్చారు సుకుమార్.
ఇక నాగ చైతన్య హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ సినిమాలో ముందుగా హీరోయిన్ గా అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కపుల్స్ మధ్య సీన్స్ ఎక్కువగా ఉండడంతో రియల్ కపుల్ అయితే కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని సమంతను తీసుకున్నారు.