ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా వాడటం వలన కళ్ల నొప్పి వస్తుంది. కంటి నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఈ పద్ధతులను ఉపయోగించండి.
కంటి నొప్పికి హోం రెమెడీ:
శరీరంలోని ప్రతి భాగం మృదువుగా ఉంటుంది, కానీ వాటిలో కళ్ళు మొదటి స్థానంలో ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో కంటి సమస్యలు ఒకటి. దీని వల్ల చిన్న వయస్సులోనే అద్దాలు ధరించాల్సి వస్తోంది. కంటి సంరక్షణలో చిన్న లోపం చాలా భారంగా మారుతుంది. ఈ రోజుల్లో పిల్లలు,పెద్దలు అనే తేడా లేకుండా అందరూ తమ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీని వల్ల కంటి నొప్పితో తరచుగా సమస్య ఉంటుంది. ఎలక్ర్టానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్లు బలహీనపడతాయి. దీనికి జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరు మొబైల్ పరికరాలు, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం వల్ల కంటి నొప్పిని ఎదుర్కొంటున్నట్టయితే దానికి ఎలా చికిత్స చేయాలో తెలుసుకోండి.
కంటి నొప్పికి ఇంటి నివారణలు:
కళ్లకు దోసకాయ
మీరు మొబైల్ పరికరాలు, ల్యాప్‌టాప్‌లతో ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్లనొప్పి రావడం ప్రారంభించినట్లయితే, దోసకాయ మీకు ఈ నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. నొప్పిని వదిలించుకోవడానికి, దోసకాయ ముక్కలను కట్ చేసి 20 నిమిషాల పాటు కళ్లపై ఉంచండి. ఈ దోసకాయను ఉపయోగించడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
కళ్లకు రోజ్ వాటర్ :
రోజ్ వాటర్ కళ్లకు చాలా మేలు చేస్తుంది. కంటి నొప్పి, చికాకు నుండి బయటపడటానికి రోజ్ వాటర్ మీకు సహాయపడుతుంది. కళ్లలో 2-3 చుక్కల రోజ్ వాటర్ వేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి. కళ్లలో దురద సమస్య ఉంటే కూడా రోజ్ వాటర్ వాడడంతో అది అంతమవుతుంది.
కళ్ళ కోసం బంగాళదుంపలు:
దోసకాయలాగే బంగాళదుంపలు కూడా కంటి నొప్పికి ఉపశమనాన్ని అందిస్తాయి. బంగాళదుంప ముక్కలను కట్ చేసి 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. ఆ చల్లని ముక్కలను కళ్ళపై ఉంచండి. దీని వల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.