పవన్ కల్యాణ్, అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం బద్రి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం అందించాడు. ఈ చిత్రం 47 కేంద్రాలలో 100 డేస్ ఆడింది. అమీషా పటేల్, రేణు దేశాయ్ తో పాటుగా పూరీ జగన్నాథ్ కు ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. అయితే ఈ సినిమా స్టోరీ పవన్ కళ్యాణ్ దగ్గరికి చేరుకోవడానికి ఓ గమ్మత్తైన స్టోరీ ఉంది.
డైరెక్షన్ కోసం అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో బద్రి సినిమా కథను తయారుచేసుకున్నారు పూరీ జగన్నాథ్. అయితే ఈ కథను అప్పటికే హీరోగా నిలదొక్కుకున్న పవన్ కళ్యాణ్ కి వినిపించాలని ప్రయత్నాలు చేశారు. కానీ పవన్‌ని కలిసే మార్గం లేదు. పవన్‌ని కలవాలంటే చోటాకె నాయుడిని సంప్రదించాల్సిందే. ఆయన్ని కలిస్తే – కథ ముందుగా తనకు కథను వినిపించు అని అన్నాడట. తనకు నచ్చితే పవన్‌కి రికమెండ్ చేస్తా అన్నాడట.
అయితే బద్రి వెరైటీ ప్రేమ కథ కాకపోవడంతో బద్రి కథ పక్కన పెట్టి – ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ వినిపించాడట. అది చోటాకి బాగా నచ్చడంతో పవన్‌కి కలిసి కథ వినిపించే ఛాన్స్ ఇచ్చాడట. అయితే ఆ అవకాశం రాగానే పూరీ జగన్నాథ్ బద్రి సినిమా కథనే పవన్ కు వివరించారట. కథ బాగా నచ్చడంతో పవన్ కూడా సినిమాని ఓకే చేశారట.
అయితే “ఇది సూసైడ్ నేపథ్యంలోని ప్రేమకథ అన్నారు ఛోటా, మరి ఇందులో సూసైడ్ కాన్సెప్టే లేదేంటి?” అంటూ పవన్ ప్రశ్నించారట. ఈ సినిమా స్టోరీ చెప్పేందుకు ఆడిన డ్రామాను పూరి జరిగినదంతా వివరించారట. ఇక ఈ సినిమా క్లైమాక్స్ మార్చమని పవన్ కోరితే మార్చనని తేగేసి చెప్పారట పవన్ . ఆ డేర్ నేస్ నచ్చి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట పవన్.