ఒకే రోజున బాలయ్య రెండు సినిమాలు రిలీజ్.. ఒకటి హిట్టు, ఇంకోటి ఫట్టు

ఒకే రోజున ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కావడం కామన్. కానీ ఓ స్టార్ హీరోకు సంబంధించిన రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వడం చాలా రెర్ .. కానీ ఇలాంటి రెర్ ఇన్సిడెంట్ నటసింహం బాలకృష్ణకి ఓ సారి ఎదురైంది. బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు చిత్రాలు 1993లో సెప్టెంబర్ 03న రిలీజయ్యాయి, అయితే ఇందులో నిప్పురవ్వ సినిమా ప్లాప్ అవ్వగా, బంగారు బుల్లోడు సినిమా సూపర్ హిట్ అయింది.

బాలకృష్ణ, విజయశాంతి హీరోహీరోయిన్లుగా నిప్పురవ్వ చిత్రం తెరకెక్కగా కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. అప్పట్లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే. బాలకృష్ణకి ఇదే తొలి 70mm సినిమా కావడం విశేషం. ఈ సినిమా పైన అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ప్లాప్ అయింది. కర్తవ్యం లాంటి సూపర్ హీట్‌‌తో ఉన్న విజయశాంతి ఇందులో ఎక్కువగా కామెడీ రోల్‌‌లో కనిపించడం ప్రేక్షకులకి నచ్చలేదు.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే విజయశాంతి కర్తవ్యం తమిళ రీమేక్ వైజయంతి ఐపీఎస్ గా రిలీజై సూపర్ హిట్ అయింది. అలాంటిది నిప్పురవ్వ సినిమాలో విజయశాంతి రోల్ కామెడీగా ఉండడం ప్రేక్షకులకు నచ్చలేదు.

ఇక బంగారు బుల్లోడు సినిమా విషయానికి వస్తే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య సరసన రమ్యకృష్ణ, రవీనా టాండన్ హీరోయిన్లుగా నటించారు. బాలకృష్ణ తో రమ్యకృష్ణ ఇది తొలి చిత్రం కాగా, రవీనాటాండన్ కి టాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా. సినిమాలో పాటలు విపరీతంగా హిట్ కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఫైనల్ గా నిప్పురవ్వ సినిమాపై బంగారు బుల్లోడు సినిమా పై చేయ్ సాధించింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here