పుట్టమచ్చ రాజయోగం.. టైలర్ సుందరానికి జై కొట్టారు

కామెడీ వంటి జానర్ లో సినిమాలు చేసి స్టా్ర్ హీరో స్టేటస్ అందుకున్న హీరోల్లో రాజేంద్రప్రసాద్ ఒకరు. ఆయన సినిమాలో కామోడీ ట్రాక్ మొయిన్ లీడ్ గా ఉంటుంది. అప్పటివరకూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నలుగురు కథానాయకుల్లో ఒకరిగా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ ను హీరోను చేసింది దర్శకుడు వంశీనే అని చెప్పాలి. ప్రేమించు పెళ్ళాడు సినిమాతో రాజేంద్రప్రసాద్ హీరోగా మారారు. అయితే ఈ సినిమా అంతగా విజయం సాధించకపోవడంతో రాజేంద్రప్రసాద్ బెంబేలెత్తిపోయారు. అయితే రాజేంద్రప్రసాద్‌లోని హాస్యకథానాయకుణ్ణి గుర్తించిన వంశీ కామోడీ ట్రాక్ లో సినిమా చేయాలని అనుకుని ఓ స్ర్కీప్ట్ రెడీ చేశారు. అదే లేడీస్ టైలర్.

ఎక్కడో గోదావరి జిల్లాలో ఓ చిన్న పల్లెటూరిలో అద్భుతమైన నైపుణ్యం ఉన్న పరమ బద్ధకిస్టు టైలరు సుందరం(రాజేంద్ర ప్రసాద్). దీనికి తోడు విపరీతమైన జాతకాల పిచ్చి. ఓ కోయదొర మాటలు నమ్మి తొడ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని చేసుకుంటే రాజయోగం పడుతుందని అలాంటి యువతి కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ టైంలో టీచర్ గా వస్తుంది సుజాత(అర్చన). తనకు ఆ మచ్చ ఉంటుంది.

ఆమెను ప్రేమలో పడేస్తాడు. ఊరిలో దుర్మార్గుడిగా పేరున్న వెంకటరత్నం(ప్రదీప్ శక్తి)చెల్లెలు గర్భవతి కావడానికి సుందరం కారణమని ప్రచారం జరుగుతుంది. దీంతో కథ కాస్తా థ్రిల్లర్ టైపులో కొత్త మలుపులు తీసుకుంటుంది. ఆ తర్వాత జరిగేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో బూతులు ఉన్నాయని బాగా ప్రచారం జరిగింది. కానీ సినిమాలో మంచి హాస్యం ఉందని పబ్లిక్ గుర్తించారు.

దీంతో ఈ సినిమా వంద రోజులు ఆడింది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి పాత్ర కోసం ముందుగా నూతన్ ప్రసాద్ అనుకున్నారు. కానీ చివరికి డేట్స్ కారణంగా ఆయన పాత్రను భరణి చేశారు. ఆయనే ఈ సినిమాకు డైలాగ్ రైటర్ కావడం విశేషం.

ఇళయరాజా స్వరపరిచి, సంగీతాన్నందించిన ఈ చిత్ర పాటలు అశేషాదరణ పొందాయి. పాటలన్నిటినీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. తాను అప్పటికే సిరివెన్నెల సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నా, సాధారణమైన కమర్షియల్ సినిమాలకు పాటలు ఎలా రాయాలో వంశీనే లేడీస్ టైలర్ సినిమా ద్వారా కొన్ని విషయాలు తెలిపారని సీతారామశాస్త్రి పేర్కొన్నారు. కమర్షియల్ పాటలు రాయలేరన్న ముద్ర పడిన సీతారామశాస్త్రిని వంశీ ఈ సినిమాకి కమర్షియల్ హిట్ పాటలు రాయించి ఆ ముద్ర చెరిపివేశారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here