మండు వేసవిలో అత్యంత కీలకమైన విషయం ఏంటో తెలుసా? ఆరోగ్యకరమైన, పోషకమైన జీర్ణ వ్యవస్థను కలిగి ఉండడం. ఈ వేసవి కాలంలో చాలా మంది కృత్రిమ పదార్ధాలు, సంతృప్త కొవ్వులను కలిగి ఉన్న చల్లటి ఆహారాల కోసం ఆరాటపడతారు. కానీ ఇది మీ ప్రేగు ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. కానీ అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
మీరు చేయాల్సిందల్లా కృత్రిమ ఆహార పదార్థాలు, సాధారణ ధాన్యాలను వేసవికి అనుకూలమైన ఆహారంతో భర్తీ చేయడమే. సరైన ప్రోబయోటిక్స్, మజ్జిగ, సత్తులను కొంచెం అదనంగా తీసుకోవడం వల్ల మీ పేగు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఈ వేసవిలో ఉబ్బరం, మలబద్ధకంతో పోరాడే వారికి ఇవి సహాయపడతాయి.
తేమ, చెమట, వేడి నుంచి రిఫ్రెష్‌గా ఉండాలంటో ఈ వేసవిలో తీసుకునే సాధారణ ఆహార పదార్థాల విషయానికొస్తే..
తృణధాన్యాలు
సాధారణ దాల్ చవల్ శరీరానికి హాని కలిగించదు. వేసవి కాలంలో మీరు వేడిని అధిగమించగల ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. తృణధాన్యాలు మీకు చాలా అవసరమైన పోషణను అందిస్తాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. సాంప్రదాయ ధాన్యాల కోసం కాకుండా బార్లీ, రాగి వంటి తృణధాన్యాలు తీసుకోవడం వల్ల మంటను తగ్గించడమే కాకుండా మంచి బ్యాక్టీరియాను వృద్ధిని ప్రోత్సహిస్తాయి.
అరటిపండ్లు
మంటతో తగ్గించడంలో అరటిపండ్లు కీలక పాత్రను పోషిస్తాయి. ఈ పండు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా అతిసారం, కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.
ఓట్స్
ఓట్స్‌లో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఇది ఆరోగ్యకరమైన బాక్టీరియాను పునరుద్ధరిస్తుంది.
మజ్జిగ
ఈ వేసవిలో మీ పేగును చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఒక కప్పు మజ్జిగ తాగండి. పెరుగును నీటిలో కరిగించి మజ్జిగ తయారుచేస్తారు. ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఈ పానీయం జీర్ణక్రియ, ఉబ్బరం, మలబద్ధకంలో సహాయపడుతుంది. ఇందులో తక్కువ కేలరీలు, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
పెరుగు అన్నం
ఈ వేసవిలో వేడిని తట్టుకునేందుకు పెరుగన్నంతో మీ కడుపుని ఆరోగ్యంగా ఉంచుకోండి. ప్రోబయోటిక్స్‌తో లోడ్ చేయబడి, జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కాల్షియం, ప్రోటీన్ లు అధికంగా ఉండే ఈ ఆహారం ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ వేసవిలో ఒక గిన్నె పెరుగు అన్నం తినండి.. మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.