చాలా మంది జలుబు లేదా ఆ ఆధారిత ఇన్ఫెక్షన్లు సోకినపుడు పాలల్లో పసుపు వేసుకుని తీసుకుంటూ ఉంటారు. అయితే పసుపు అనేది కేవలం జలుబుకే కాదు ఇతర అనారోగ్య సమస్యలనూ నివారిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పసుపులో కర్కుమిన్, దాని కంటే బలమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండడం చేత శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతోంది. అవి కణాల పనితీరుకు చాలా దోహదం చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్‌లు, ఇతర వ్యాధులను నివారించవచ్చు. గోల్డెన్ మిల్క్ గా పిలవబడే ఈ పసుపు పాల లక్షణాలను దాల్చినచెక్క, అల్లం కూడా పోలి ఉన్నాయి, ఈ రెండూ కూడా అదే తరహా యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.
2. పసుపును పాలల్లో వేసుకుని తాగడం వల్ల వాపు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. క్యాన్సర్, మెటబాలిక్ సిండ్రోమ్, అల్జీమర్స్, గుండె జబ్బులతో సహా దీర్ఘకాలిక వ్యాధులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల తలెత్తే కీళ్ల నొప్పులను కూడా తగ్గించవచ్చు.
3. పసుపును పాలు జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధి తరహా మెదడు రుగ్మతలను ఇది తగ్గిస్తుంది.
4. పసుపు మనలో క్షణక్షణానికి మారిపోయే మూడ్ ను కూడా మారుస్తూ ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంట్లో ఉండే కర్కుమిన్ – మానసిక స్థితిని పెంచుతుంది. నిరాశ లక్షణాలను తగ్గిస్తుంది. నిస్పృహ రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఇది మంచి మేలు చేస్తుంది.
5. గుండె జబ్బులను నుంచి కూడా పసుపు రక్షిస్తుంది. ఇందులో ఉండే కర్కుమిన్ మీ రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది తీసుకునే వారిలో 65శాతం గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నట్టు తెలుస్తోంది.