వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్ ప్రత్యేకంగా మామిడి పండ్లకు ఫేమస్, కాబట్టి వీటితో పాటు కొన్ని ఫుడ్స్ లేదా ఆహార పదార్ధాలను కలిపి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఐస్ క్రీంతో..
హాట్ అండ్ కోల్డ్ కాంబినేషన్ లో ఆహారాన్ని ఎప్పుడూ తీసుకోరాదు. ఐస్ క్రీం, మామిడి కాయలను కలిపి ఎప్పుడూ తీసుకోకూడదు.
నిమ్మ, నారింజలతో..
సిట్రస్ పండ్లు లేదా పుల్లని రుచి కలిగిన పండ్లను కలిపి తీసుకోరాదు. నారింజ, నిమ్మ లాంటి సి విటమిన్ గల పండ్లను మామిడి పండుతో కలిపి తీసుకోకూడదు.
పెరుగుతో..
మామిడి శరీరంపై వేడి ప్రభావాన్ని చూపిస్తుంది, కాబట్టి చల్లదనాన్నిచ్చే పెరుగును మామిడి పండుతో కలిపి తీసుకోకూడదు.
రెగ్యులర్ భోజనంతో..
రోటీ, సబ్జీతో మామిడి కాయ ముక్కలను చాలా మంది కలిపి తింటుంటారు. కానీ ఇది జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది.
శీతల పానీయాలతో..
కూల్ డ్రింక్ లతో మామిడి పండ్లను తీసుకోరాదు. ఎందుకంటే ఈ కాంబినేషన్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది,
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా చాలా మంది మామిడిపండ్లను అనే రసాయనాలను వాడి పండిస్తున్నారు. కాబట్టి దీన్ని తినే ముందు బాగా కడిగి తినడం మర్చిపోవద్దు. వీటిని భోజనం చేసిన కొంత సమయం తర్వాత తీసుకోవాలి, లేదంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మామిడి తిన్న తర్వాత ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి.