నడక
పీరియడ్స్ వచ్చినపుడు శారీరక శ్రమ లేకుండా సాయంత్రం వేళలో తేలికపాటి నడక మంచి మార్గం.
నాగు పాము భంగిమ
కోబ్రా భంగిమ అని పిలిచే ఈ భంగిమ పీరియడ్స్ సమయంలో తిమ్మిర్లు, ఉబ్బరం నుంచి శరీరానికి ఉపశమనం అందిస్తుంది.
బాడీని సాగదీయడం
ఇది కొంచెం కష్టంగా అనిపించినా.. ఋుతుక్రమం సమయంలో వేసే సాధారణ స్ట్రెచ్ లు శరీరాన్ని తేలికపరుస్తాయి.
డ్యాన్స్
ఈ క్లిష్ట సమయాల్లో శరీరాన్ని కదిలించడం మంచి మార్గం. అందుకు మనసును ఆహ్లాదపరిచేలా డ్యాన్స్ చేయడం మంచి ఫలితాన్నిస్తుంది.
ఈత
పీరియడ్స్ సమయంలో శరీరానికి అత్యంత రిలాక్సింగ్ గా ఉండడం ముఖ్యం. అందుకు స్విమ్మింగ్ మంచి మార్గం.
ఇండోర్ సైక్లింగ్
ఈ సమయంలో చాలా మందికి బయటకు వెళ్లాలని అనిపించదు. కాబట్టి అలాంటి వారికి ఇండోర్ సైక్లింగ్ ఉత్తమమైన ఎంపిక.
శవాసనం
పీరియడ్స్ టైంలో శరీరంలోని ఒత్తిడిని తగ్గించేందుకు శవాసనం మంచి మేలు చేస్తుంది.
వీటితో పాటు జీవన శైలిలో పలు మార్పులు, ఆహార నియమాలు పాటిస్తే.. పీరియడ్స్ సమయంలోనూ ప్రశాంతంగా ఉండొచ్చు.