ప్రెగ్నెంట్తో సిమ్రాన్, నచ్చక చిరు పక్కన పెట్టిన రజినీకాంత్ మూవీ..!

తినే మెతుకు మీద మన పేరు రాసుండాలని అంటారు. అలాగే ఇండస్ట్రీలో కూడా చేసే సినిమాపై హీరో, హీరోయిన్లు పేరు కూడా రాసి పెట్టి ఉండాలి. చాలా మందిని అనుకుని చివరికి మరోకరితో సినిమా ఫినిష్ చేయడం ఇండస్ట్రీలో కామాన్. దీనికి స్టార్ హీరో, హీరోయిన్లు కూడా అతీతం కాదు. ఇలాంటిదే మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ సిమ్రాన్ విషయంలో కూడా అదే జరిగింది.

రజినీకాంత్ హీరోగా పి వాసు డైరెక్షన్ లో వచ్చిన చంద్రముఖి సినిమాకు ముందుగా గంగ పాత్రకు హీరోయిన్ స్నేహను అనుకున్నారు. కానీ ఆమెను ఆమెను సంప్రదించలేదు. ఆ తరువాత సిమ్రాన్ కు చెబితే ఆమె ఓకే చెప్పింది. షూటింగ్ లో కూడా పాల్గొనలేదు. ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అని తెలియడంతో సినిమా నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో సదా, రీమాసేన్‌‌ని సంప్రదించారు కానీ చివరికి జ్యోతికను తీసుకున్నారు. రజినీ పక్కన హీరోయిన్‌‌గా దుర్గ పాత్రకి నయనతారను అనుకుని ఆమెనే తీసుకున్నారు. గంగ పాత్ర జ్యోతికకు ఎంతమంచి పేరును తీసుకువచ్చిందో అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమాను కన్నడలో ( ఆప్తమిత్ర )ని చూసిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య చిరంజీవితో రీమేక్ చేయాలని అనుకున్నారు. చిరంజీవిని కలిసి ఇదే విషయాన్ని చెప్పారు. కానీ చిరంజీవి అంతగా పట్టించుకోకపోవడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఇదే సినిమాని థియేటర్‌‌కి మారువేషంలో వెళ్లి చూసిన రజినీ.. ఫ్లాట్ అయిపోయి వెంటనే తమిళ్, తెలుగు బాషల్లో రీమేక్ చేయాలని అనుకున్నారు. డైరెక్టర్ గా పి వాసును రజినీనే ఫైనల్ చేశారు. ముందుగా నాగవల్లి అనుకున్న ఈ సినిమాకు రజినీ సూచన మేరకు చంద్రముఖిగా మార్చారు.

అయితే చంద్రముఖి చిత్రాన్ని చూసిన చిరంజీవి డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్యను మెచ్చుకున్నారు. సినిమాపై ఇంట్రెస్ట్ చూపించినందుకు స్వారీ చెప్పారు. ఎందుకో మళ్లీ వి.ఎన్.ఆదిత్య, చిరంజీవి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here