ఆ సినిమా కోసం రాజశేఖర్‌ను రికమెండ్‌ చేసిన చిరు

మమ్ముట్టి, సురేష్ గోపి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన మలయాళం చిత్రం ఒరు సీబీఐ డైరీ కురిప్పు .. 11 ఫిబ్రవరి 1988లో రిలీజైన ఈ మూవీ సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాను చూసిన హీరో రాజశేఖర్.. దీనిని తెలిసిన నిర్మాతలకు చూపించి రీమేక్ హక్కులను కొనిపించి అందులో నటించాలనుకున్నారు. అయితే అప్పటికే ఈ సినిమా హక్కుల్ని నిర్మాత అల్లు అరవింద్‌ కొనేశారని రాజశేఖర్‌కు తేలియడంతో చిరంజీవితోనే ఆ సినిమా తీస్తారని ఊహించారు.

అయితే ఓ సినిమా వేడుకల్లో రాజశేఖర్‌, అల్లు అరవింద్‌ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒరు సీబీఐ డైరీ కురిప్పు చిత్రం హక్కులను తానుకొన్న సంగతి చెప్పి, అందులో నటిస్తావా అని రాజశేఖర్‌ని అడిగారు అల్లు అరవింద్‌. దీంతో వెంటనే రాజశేఖర్ సంతోషంగా చేస్తానని చెప్పారట. సినిమా షూటింగ్ అయిపోయాక…అల్లు అరవింద్ తో మాట్లాడిన రాజశేఖర్… ఈ సినిమాను చిరంజీవి తోనే సినిమా తీస్తారని అనుకున్నానని ఈ సినిమాను నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్‌ అంటూ రాజశేఖర్‌ కృతజ్ఞతలు తెలిపారట.

అయితే మొదట చిరంజీవితోనే ఈ సినిమాను తీద్దామనుకున్నామని, కానీ ఆయన డేట్స్ అడ్జెట్స్ కాకపోవడంతో చిరంజీవే స్వయంగా మీ పేరు సజెస్ట్‌ చేశారని చెప్పారట అల్లు అరవింద్. దీంతో చిరంజీవిని కలిసిన రాజశేఖర్‌ ధన్యవాదాలు తెలిపారట. ఈ విషయాన్ని న్యాయంకోసం అభినందన సభలో రాజశేఖర్‌ స్వయంగా పంచుకున్నారు. 1988 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో విడుదలైన సినిమాలో రాజశేఖర్ సరసన సీత హీరోయిన్ గా నటించింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc