ఎర్రకోటను తలపించే సిటీ కాలేజ్‌

ఎర్రకోట ఉన్నది ఢిల్లీలోనా…?

అరె హైదరాబాద్‌లోనూ ఉందేమోనని పొరబడ్డామే… అనిపించేలా ఉంటుందీ భవనం.

‘ఖిలా ఏ ముబారక్‌’ అని పిలిచేది ఢిల్లీ లాల్‌ఖిలానా…?

అయితే మరి విద్యాభ్యాసపు తాలీమ్‌లతో జ్ఞానాన్ని మస్తకాల్లో నింపి…

‘ముబారక్‌’ అంటూ అభినందనాశీర్వచన వర్షాలను వర్షించేదీ భవనం.

అటానమస్‌ హోదాతో గ్రాడ్యుయేట్లనూ, పోస్ట్‌గ్రాడ్యుయేట్లనూ తయారు చేస్తుందిది.  విద్యావంతులను రూపొందించే పరిశ్రమగా భాసిస్తోందిది.

కష్టపడి చదివే విద్యార్థుల నిర్వరామ, నిర్విశ్రమ శ్రమ…తో ఎరుపురంగునలముకుందా అనిపించే ఎర్రటి భవనమిది.

‘‘మిడ్‌నైట్‌ ఆయిల్‌’’ను మండిస్తూ చదువుల కోసం వెలిగించిన దీపపు కాంతుల చివరల ఎరుపును సంతరించుకున్నట్లు కనిపించే నిర్మాణమిది.

అదే… సిటీ కాలేజ్‌.

ఆసఫ్‌జాహీ వంశానికి చెందిన ఆరో నిజామ్‌ మహబూబ్‌ అలీ ఖాన్‌ 1865లో తొలుత ఓ పాఠశాలను నెలకొల్పాడు. మొదట దానికి ‘‘మదరసా దార్‌ఉల్‌ఉలూమ్‌’’ అంటూ పేరుపెట్టాడు. ఆ తర్వాత ఆ స్కూల్‌ను 1921లో ఈ భవనానికి తరలించాడు. అలా తరలించిన దానికి ‘‘సిటీ హైస్కూల్‌’’ అని పేరు. అన్నట్టు… అప్పట్లో ఏడో నిజామ్‌ అయిన ఉస్మాన్‌అలీఖాన్‌ ఆధ్వర్యంలో హైకోర్టును నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టిన నవాబ్‌ఖాన్‌ బహద్దూర్‌ మీర్జా అక్బర్‌ బేగ్‌ యే… ఈ నిర్మాణానికీ ఛీఫ్‌ ఇంజనీర్‌గా వ్యవహరించాడు.

స్కూలు స్థాయి నుంచి పెంపు చేస్తూ… 1921లోనే  ఈ విద్యాసంస్థలో తొలిసారిగా ఇంటర్మీడియట్‌ స్థాయి కోర్సు ఎఫ్‌.ఏ.ను 30 మంది విద్యార్థులతో ప్రారంభించారు.  అదే క్రమంగా తరగతులనూ, హోదాలు, స్థాయులను పెంచుకుంటూ పెంచుకుంటూ గ్రాడ్యుయేట్లూ, పోస్ట్‌గ్రాడ్యుయేట్లూ  చదివే అటానమస్‌ విద్యాసంస్థగా  రూపొందింది. అటు తర్వాత మాస్టస్ట్‌ సైన్స్‌ డిగ్రీలతో, రీసెర్చ్‌ సెంటర్లతో అనేక విభాగాలతో… దినదినాభివృద్ధి చెందుతూ క్రమంగా పెరుగుతూ వచ్చిందీ విద్యాసంస్థ.

అన్నట్టు… ఎక్కడ మొదలు పెట్టాం… ఎర్రకోట దగ్గర కదా?!

ఎర్రకోటకూ… ఎర్రటి ఈ సిటీకాలేజీ భవానికీ చూడ్డానికి ఎంతో పోలిక కదా…

చూడ్డానికే కాదు… మరో పోలికా ఉంది.

అవునూ… జాతీయ పర్వదినాల్లో సగర్వంగా జెండా ఎగరేసేది ఎర్రకోట మీదే కదా.

అవును… అక్కడిలాగే అచ్చం ఎర్రకోటలా ఉన్న ఇక్కడ కూడా విద్యార్థులు సమ్మునతమైనీ ఈ భవనం నుంచి తమ విద్యా విభాదిత్య విజారిత విజ్ఞానాలతో

కీర్తి పతాకలను ఎగరేస్తారు.

సర్వసత్తాకస్వాతంత్రమంత గొప్పది విద్య కూడా.

మన విద్యావిజ్ఞానాలతో ఎవరికీ లొంగకుండా నిటారుగా నిలబెట్టుకునేది

మన సార్వభౌమత్వ సుభువన భవన కీర్తి పతాక. ఎంత బాగుందీ పోలిక!!

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here