పరిశోధకులు 18 ప్రసిద్ధ రకాల కాంటాక్ట్ లెన్స్‌లను పరీక్షించి ఓ సంచలన విషయాన్ని కనుగొన్నారు. ప్రతిదానిలో అధిక స్థాయిలో సేంద్రీయ ఫ్లోరిన్, పాలీఫ్లోరోఅల్కైల్ పదార్ధాల (PFAs) మార్కర్ ఉన్నట్టు కనుగొన్నారు.
కళ్లద్దాలు ధరించడం అసహ్యించుకునే వారికి, కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ చిన్న విషయం ఎవరికైనా ప్రాణాంతకంగా మారుతుంది. కాంటాక్ట్ లెన్స్ నుండి వచ్చే రసాయనాలు హానికరం. కొన్నిసార్లు ఇది పెద్ద వ్యాధులకు దారితీస్తుంది. USనుండి వచ్చిన సాఫ్ట్ కాంటాక్ట్ లెన్స్‌లు ఎక్కువగా విషపూరితమైన, క్యాన్సర్‌ను కలిగించే ‘ఫరెవర్ కెమికల్స్’తో రూపొందించబడిందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది.
కాంటాక్ట్ లెన్సులు మిమ్మల్ని క్యాన్సర్ బాధితుల్ని చేయగలవా?
గార్డియన్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, పరిశోధకులు 18 ప్రసిద్ధ రకాలైన కాంటాక్ట్ లెన్స్‌లను పరీక్షించారు. వాటిలో అధిక స్థాయిలో సేంద్రీయ ఫ్లోరిన్, పాలీఫ్లోరో ఆల్కైల్ పదార్ధాల (PFAs) మార్కర్ ఉన్నట్టు కనుగొన్నారు. దీర్ఘకాలంలో ఈ కాంటాక్ట్ లెన్సులు శరీరంలోని క్యాన్సర్ కణాలను సక్రియం చేసి క్యాన్సర్ వైపు నడిపించగలవని శాస్త్రవేత్తల చెబుతున్నారు. ముఖ్యంగా, PFAS 14,000 రసాయనాల తరగతిని సూచిస్తుంది, వీటిని సాధారణంగా వినియోగదారు ఉత్పత్తులలో నీరు,వేడి-నిరోధకతగా చేయడానికి ఉపయోగిస్తారు. బట్టలు, ఫర్నీచర్, అడ్హెసివ్స్, ప్యాకేజింగ్, వైర్లు గృహ వస్తువులలో వీటిని ఉపయోగిస్తారు. అవి సహజంగా విచ్ఛిన్నం కావు కాబట్టి వాటిని ”ఎప్పటికీ కరగని రసాయనాలు అని అంటారు.
PFAS అనేది మానవ నిర్మిత రసాయనాలు. ఇవి చాలా కాలం పాటు పర్యావరణంలో ఉంటాయి. ఇది ఫ్లోరిన్, కార్బన్ కలపడం ద్వారా తయారవుతుంది. PFAS క్యాన్సర్, గర్భధారణ సమస్యలు, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, స్వయం ప్రతిరక్షక రుగ్మతలు సమస్యలను కలిగిస్తుంది. కాంటాక్ట్ లెన్స్‌లకు సంబంధించిన ఈ పరిశోధనలో మరింత పరిశోధన అవసరం, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం.