ప్రేమంటే ఇదేరా .. సినిమా అంటే ఇదేరా

ప్రేమించుకుందాం రా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దర్శకుడు జయంత్ సి పరాంజీకి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే… స్టార్ హీరో చిరంజీవితో సినిమా ఛాన్స్ వచ్చేసింది. అదే బావగారు బాగున్నారా. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో జయంత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. ఆ తరువాత చిత్రాన్ని తనకు మొదటి సినిమా అవకాశాన్ని ఇచ్చిన వెంకటేష్ తో చేయాలని అనుకున్నారు జయంత్.

దీనరాజ్ చెప్పిన ఒక లైన్ నచ్చడంతో పరుచూరి బ్రదర్స్ తో కలిసి దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అదే ప్రేమతో రా.. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్‌కుమార్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. అప్పటికీ చాలామంది హీరోయిన్లు టాలీవుడ్ లోఉన్నప్పటికీ బాలీవుడ్ నుంచి ప్రీతి జింటాను తీసుకువచ్చారు జయంత్ .సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్ పాటలు రాయగా రమణ గోగుల సంగీతం అందించారు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రాజ్ ఇచ్చారు.

తన స్నేహితుడు పెళ్లి కోసం పల్లెటూరికి వెళ్లిన హీరో మురళీకి అక్కడ హీరోయిన్ శైలు పరిచయం అవుతుంది. అయితే పరువుకు ప్రాణమిచ్చే హీరోయిన్ తండ్రి ఆమెకు వేరే సంబంధం ఖాయం చేయడంతో కథ ములుపు తిరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న హీరో ఎలాగైనా తన ప్రేమను దక్కించుకోవాలని శైలు ఇంట్లోనే మకాం పెడతాడు. అక్కడ వారందరినీ ఒప్పించి హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు.

హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే కామెడీ, లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. 1998 అక్టోబరు 30న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల చేత సినిమా అంటే ఇదేరా అని అనిపించుకుంది. కన్నడంలో ఓ ప్రేమవే అనే పేరుతో దీనిని రీమేక్ చేశారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here