రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందండి మూవీ హీరో శ్రీకాంత్ కు మంచి బ్రేక్ ఇచ్చింది.ఈ సినిమాతో శ్రీకాంత్ మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు. ఈ సినిమా తెచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలకు సైన్ చేశాడు శ్రీకాంత్. ఇందులో వన్స్ మోర్, వినోదం, ఎగిరే పావురమా, తాజ్ మహల్, ఆహ్వానం, మా నాన్నకు పెళ్లి మాత్రమే విజయం సాధించాయి.
సుప్రభాతం, గమ్యం, శుభలేఖలు, ఆయనగారు, మాణిక్యం, ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు, మనసులో మాట, అనగనగా ఒక అమ్మాయి, పిల్ల నచ్చింది, పంచదార చిలక ఇలా ఏ ఒక్కటి కనీసం యావరేజ్ కూడా అనిపించుకోలేదు. ఇలాంటి టైమ్ లో నిర్మాత రామానాయుడుకు ఓ కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీ బాగా నచ్చింది. ఆయనే చంద్రమహేష్. ఆ స్టోరీనే ప్రేయసి రావే. కొత్త దర్శకుడే అయినప్పటికీ రామానాయుడు మీదున్న నమ్మకంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రీకాంత్.
మంచి ఫామ్ లో ఉన్న రాశిని హీరోయిన్ గా తీసుకున్నారు.పోసాని డైలగ్స్ రాశారు. శ్రీలేఖ మ్యూజిక్. ఈ సినిమా కోసం హెయిర్ స్టైల్ మార్చుకో అని రామానాయుడు చెప్పినా శ్రీకాంత్ వినలేదు. ప్రేమించిన అమ్మాయికి వేరే అతనితో పెళ్లి అయి అతనికి గుండె సమస్య ఉంటే హీరో తన గుండెను త్యాగం చేస్తాడు. 19 నవంబర్ 1999లో రిలీజైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. పాతిక సెంటర్లలో వంద రోజులు ఆడి శ్రీకాంత్ ను వరుస ప్లాప్స్ నుండి బయట పడేసి ఊపిరి పోసింది.