కంటోన్మెంట్​ ఎమ్మెల్యే కన్నుమూత.. నేడు తారకరత్న అంత్యక్రియలు.. షర్మిల అరెస్ట్.. ఒవైసీ ఇంటిపై దాడి.. మజ్లిస్​ను తరిమికొడుదామన్న బండి.. ఈరోజు టాప్​ టెన్​ న్యూస్​

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో మరణించారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా సాయన్న హెవీ షుగర్​తో అనారోగ్యానికి గురయ్యారు. షుగర్​తో కాలు కోల్పియిన సాయన్న ఇటీవల కిడ్నీ వ్యాధితో ఆసుపత్రిలో చేరారు. సాయన్న అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉన్న సాయన్న 2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్​ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇందిరా పార్కు సమీపంలోని సాయన్న ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్​ సాయన్న పార్థివ దేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి మహిళా కమిషన్ నోటీసులు

ఎమ్మెల్సీ పాడి కౌశిక్​రెడ్డికి జాతీయ మహిళా కమిషన్​ నోటీసులు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌పై కౌశిక్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలపై వివరణ కోరింది. ఫిబ్రవరి 21వ తేదీన ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

ఒవైసీ ఇంటిపై దాడి

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ  ఇంటిపై దాడి జరిగింది. ఢిల్లీలోని  ఒవైసీ  ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. దీనిపై ఒవైసీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.  దాడిలో తన ఇంటి అద్దాలు ద్వంసం అయినట్లుగా ఒవైసీ  పోలీసులకు తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు తన ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగిందని ఒవైసీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఒవైసీ పోలీసులను కోరారు. సమాచారం అందుకున్న ఢిల్లీ అదనపు డీసీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆయన నివాసానికి వెళ్లి  నుంచి ఆధారాలు సేకరించింది. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు

తారకరత్నకు అంతిమ నివాళులు

సినీనటుడు, టీడీపీ నేత తారకరత్నకు ప్రముఖులు నివాళులు అర్పించారు. తారకరత్న భౌతిక కాయానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రహ్మణి, వైస్సార్‌టీపీ ప్రెసిడెంట్‌ షర్మిల, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, సినీనటుడు అలీ, పలువురు రాజకీయ నేతలు నివాళి అర్పించారు. సోమవారం మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించిందని అన్నారు. ఆస్పత్రి నుంచి కోలుకుని వస్తారని ఆశించామని, 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి తమకు దూరమై కుటుంబానికి విషాదాన్ని మిగిల్చారని అన్నారు. తారకరత్న పార్థివదేహాన్ని బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు తెచ్చినప్పటి నుంచి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడే ఉన్నారు.

షర్మిల అరెస్ట్.. పాదయాత్ర రద్దు

2sharmila2.jpg

మహబూబాబాద్‌లో పాదయాత్ర శిబిరంలో ఉన్న వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను ఆదివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కణ్నుంచి పోలీస్​ వెహికిల్​లో హైదరాబాద్‌కు తరలించారు. పాదయాత్ర అనుమతిని రద్దు చేసినట్లు పోలీసులు ఆమెకు నోటీసులు అందజేశారు. ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​ ఆందోళనకు దిగటంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. షర్మిలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ మహబూబాబాద్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌నాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాఉ. మరోవైపు ఎమ్మెల్యే భార్య డాక్టర్‌ సీతామహాలక్ష్మి భారీ సంఖ్యలో ఎమ్మెల్యే అనుచరులను వెంటబెట్టుకొని షర్మిల పాదయాత్ర శిబిరం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. వైఎస్సార్‌టీపీ ఫ్లెక్సీలను తగులబెట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

మజ్లిస్​ను తరిమికొడుతాం : బండి సంజయ్​

తెలంగాణలో మజ్లిస్​ను తరిమికొడదామని, భాగ్యనగర్‌ ప్రజలంతా ఆ పార్టీ సవాల్‌ను స్వీకరించి పోరాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. యువకులంతా ఎనిమిది నెలలపాటు సమయమిస్తే.. తెలంగాణలో రామ రాజ్యాన్ని తీసుకొచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని చెప్పారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం కార్వాన్‌ నియోజకవర్గంలో జియాగూడ కబేళా వద్ద శివాజీ మహారాజ్‌ సేవాదళ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభా యాత్రలో బండి సంజయ్‌ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రజాకార్ల వారసత్వ పార్టీ ముందు మోకరిల్లి.. హిందుత్వాన్ని తాకట్టు పెట్టాడని విమర్శించారు.

హైదరాబాద్​లో సీరం సెంటర్​

హైదరాబాద్‌లో ‘‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ ఔషధ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ప్రకటించింది. అంటువ్యాధులు, మహమ్మారులు ప్రబలినప్పుడు వాటిని ఎదుర్కొనే సన్నద్ధతకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ మేరకు సంస్థ సీఈవో అధర్‌ పూనావాలా ఆదివారం వెల్లడించారు. సీరం వ్యవస్థాపకుడు డాక్టర్‌ సైరస్‌ పూనావాలా పేరిట ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఐఐపీహెచ్‌) ప్రాంగణంలో దీనిని నెలకొల్పనున్నారు. ప్రజారోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం (రియల్‌ టైమ్‌ ఇన్ఫర్మేషన్‌) అందించడం, వనరులు సమకూర్చడం వంటివి ఈ కేంద్రం చేస్తుంది. తక్షణ స్పందనతో పాటు, బాధితులకు భరోసా కల్పిస్తూ, కావాల్సిన విధంగా తోడ్పడుతుందని వివరించింది. వ్యాధిపై చైతన్యం చేసే కేంద్రంగా వ్యవహరిస్తుందని తెలిపింది. వైద్య రంగ నిపుణులతో పాటు, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఈ కేంద్రంలో ఉంటాయని సీరం పేర్కొంది. 

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here