కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి మంచి కథలు వస్తే హీరో కూడా నటిస్తూ మంచి ఫేమ్ తెచ్చుకుంటున్నాడు ప్రియదర్శి. 2016 లో టెర్రర్ అనే సినిమాలో టెర్రరిస్టుగా నటించాడు ప్రియదర్శి. . అదే సంవత్సరంలో వచ్చిన పెళ్ళి చూపులు సినిమాలో హీరో స్నేహితుడు కౌశిక్ పాత్రలో నటించి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో ప్రియదర్శి తెలంగాణా యాసలో పలికిన సంభాషణలు బాగా పేలాయి.
ఇక ఇటీవల వచ్చిన బలంగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. దీంతో ప్రియదర్శి గురించి నెటిజన్లు బాగానే సెర్చ్ మొదలుపెడుతున్నారు. ప్రియదర్శి భార్య పేరు రీచా శర్మ..ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రీచా శర్మ నవలా రచయిత్రి. ఆమె అనేక నవలలు రాసింది.
గతంలో ఆడిషన్స్‌కు వెళ్లేటప్పుడు బట్టలు కొనుక్కోడానికి తన భార్య రిచానే డబ్బులు ఇచ్చేదని, అంతేకాకుండా తన మొబైల్, ట్రావెల్ ఖర్చులు కూడా ఆమెనే కట్టేదని ప్రియదర్శి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక ప్రియదర్శి నాన్న పేరు పులికొండ సుబ్బచారి.. ఆయన ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన పలు పద్యాలు, కవితలు కూడా రాసేవారు. ప్రియదర్శి చెల్లెలు నావికాదళంలో లెఫ్టినెంట్ కమాండర్.