డాడీ సినిమాను నేను చేస్తే బాగుండు అనుకున్న స్టార్ హీరో

చిరంజీవి, సిమ్రాన్ హీరోహీరోయిన్లుగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డాడీ. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. ఎస్.ఎ.రాజ్‌కుమార్ సంగీతం అందించారు. 2001 అక్టోబర్ 4 న రిలీజైన ఈ సినిమా 97 కేంద్రాలలో 50 రోజులు, 15 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. అయితే ఈ సినిమాను ముందుగా చిరంజీవిని కాకుండా వేరే హీరోతో తీయాలని అనుకున్నారట.

ఒకానొక టైం లో వరుసగా మాస్ సినిమాలు చేయడంతో చిరంజీవి కి అవి రొటీన్ అనిపించాయి అప్పుడు అల్లు అరవింద్ చెప్పిన సలహా ప్రకారం వెంకటేష్ లాగా ఒక ఫ్యామిలీ సినిమా చేద్దాం అనుకొని భూపతిరాజా అందించిన కథను తీసుకొని సత్యానంద్ గారితో డైలాగ్స్ రాయించారు. డైరక్టర్ గా సురేష్ కృష్ణను తీసుకున్నారు.

అయితే ఈ సినిమా కథను రచయిత భూపతిరాజా చిరంజీవికి వినిపించగా ఆయన ఈ కథకు హీరో వెంకటేష్ అయితే సరిపోతాడని చెప్పారట. కానీ భూపతి రాజా ఇది చిరంజీవికి వెరైటీగా ఉంటుందని చెప్పి ఒప్పించాడట. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్ కూడా ఈ సినిమాను చూసి చిరంజీవితో ఈ సినిమా తాను చేసి ఉంటే బాగుండేదని అన్నారట.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here