నువ్వు నేను : హీరోయిన్ తోనే హీరోయిన్ను సెలెక్ట్ చేయించిన తేజ

ఉదయ్ కిరణ్, అనిత ముఖ్య పాత్రల్లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నువ్వు నేను. ఆర్. పి. పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2001లో రిలీజైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది, ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో ఐదు నంది పురస్కారాలు దక్కాయి. అంతేకాకుండా నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు కూడా దక్కాయి.

ముందుగా ఈ సినిమాను హీరో మాధవన్ తో చేయాలని దర్శకుడు తేజ అనుకున్నారు. అయితే, తెలుగు సినిమాల్లో నటించడంపై మాధవన్‌కు ఆసక్తి లేదని అ ఆఫర్‌ను తిరస్కరించారు. దాంతో ఆ పాత్ర ఉదయ్ కిరణ్ కి దక్కింది. ఇక హీరోయిన్ గా చాలా మందిని అనుకున్న తేజ అందులో ఓ అమ్మాయిని సెలెక్ట్ చేశారు.

అయితే అ అమ్మాయి పలురకాల షరతులను విధించిందని దాంతో తేజ ఆమె ద్వారా మరో ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేయించి ఆమెని సినిమాలో హీరోయిన్ గా నటింప చేశామని, ఆ విధంగా నువ్వు నేను చిత్రంలో హీరోయిన్ గా అనితను ఎంపిక చేశారట. ఈ విషయాన్ని తేజ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈ చిత్రం హిందీలోకి యే దిల్ (2003)గా, తమిళంలో మధురై వీరన్ గా, బెంగాలీలో డుజోన్ (2009)గా రీమేక్ అయింది, అనిత హిందీ వెర్షన్‌లో తన పాత్రను తిరిగి పోషించడం విశేషం. ఈ చిత్రంతో ఉదయ్ కిరణ్ కు వరుస అవకాశాలు రాగా, అనితకు బిగ్ ఏంట్రీ దక్కింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here