మనది ఉష్ణమండల దేశమైనందున ఈ వేసవికాలంలో నోరు ఎండిపోయినట్లు, అలసిపోయినట్లు అనిపించవచ్చు. ఈ సమయంలో మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం అత్యవసరం. మండే వేడి వల్ల నిర్జలీకరణం, చర్మ సున్నితత్వం, విటమిన్స్, మినరల్ లోపాలు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. మన శరీరంలోని ప్రతి వ్యవస్థ సమర్ధవంతమైన ఆపరేషన్‌కు నీరు అవసరం. కాబట్టి అందుకు నీరు త్రాగడమే కాకుండా, మనల్ని మనం హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి పండ్లు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ, మండుతున్న ఉష్ణోగ్రతల రిత్యా.. మన శరీరంలోని నీరు బయటకు పోతుంది. అందుకు పండ్లు మంచి మేలును చేస్తాయి. పోషకాహారం, నీటి కంటెంట్ అధికంగా ఉండే పండ్లలో తక్కువ కేలరీలు ఉంటాయి. దీని వలన కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఆహారంలో గొప్పగా చేర్చే వేసవి పండ్ల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం.
మామిడి పండ్లు:
సీజన్ పండ్లయిన మామిడిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయి, కంటి చూపును మెరుగుపరుస్తాయి.
పుచ్చకాయ:
నీరు, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉండే ఈ పండు వేడి వాతావరణానికి శరీరం హైడ్రేషన్ కు గురి కాకుండా కాపాడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని A, C విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
పైనాపిల్:
గొప్ప రుచిని కలిగి ఉండడమే కాకుండా.. దీన్నుంచి తీసిన జ్యూస్ ఆరోగ్యానికి మరింత ప్రయోజనకారిగా నిలుస్తుంది. ఇది సహజ తీపిని అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, బ్రోమెలైన్ అనే ఎంజైమ్.. ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియలో కూడా సహాయపడుతుంది.
ద్రాక్ష:
ఈ చిన్న పండ్లు వేసవిలో ఉత్తమ పండ్లుగా పరిగణించవచ్చు. వీటిలో ఉండే 81% వాటర్ కంటెంట్ శరీరాన్ని రోజంతా హైడ్రేట్ గా ఉంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు A, C తో పాటు రెస్వెరాట్రాల్ ఉంటుంది. ఇది వేగంగా శక్తిని అందించడంలో సహాయపడుతుంది.
నారింజ:
ఈ సిట్రస్ పండులో విటమిన్లు, మినరల్స్‌తో నిండిన పోషకాహార నిల్వలు ఉంటారు. ఇందులో ఉండే విటమిన్ సి కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, గుండె పనితీరును మెరుగుపరచడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.
ఈ వేసవిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లతో పాటు తీపి, నీరు అధికంగా ఉండే పండ్లను తినండి. ఈ సీజన్‌లో గొప్ప ప్రయోజనాన్ని పొందండి. మీకు ఇష్టమైన పండ్లను ఆరోగ్యకరమైన చిరుతిండిగా లేదా పెరుగు, ఐస్‌క్రీం లేదా జ్యూస్‌లకు జోడించడం ద్వారా వాటిని ఆస్వాదించండి.