చాలా మంది అల్పాహారంగా ఎగ్ టోస్ట్ తీసుకుంటారు. ఈ ప్రత్యేకమైన ఫుడ్ కాంబినేషన్ ఆరోగ్యకరమైనదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది అధిక కేలరీల ఆహారం అయినప్పటికీ, మీ శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఎగ్ బ్రెడ్‌ని ఎనర్జీ ఫుడ్‌గా చూస్తారు. మరి బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్ బ్రెడ్‌ను చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
గుడ్డు, బ్రెడ్ ఆరోగ్య ప్రయోజనాలు:
USDA ప్రకారం, గుడ్లు, బ్రెడ్ రెండూ అధిక కేలరీలు ఉండే ఆహారాలు. ఈ రెండింటి కేలరీలను పరిశీలిస్తే, ఇవి సుమారుగా 250 నుంచి 350 వరకు ఉంటాయి. దీన్ని తినడం ద్వారా మీ శరీరానికి శక్తి అందుతుంది. ఇది అధిక-ప్రోటీన్ అల్పాహారం. కండరాల ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. శరీర నిర్మాణానికి సహాయపడుతుంది. అంతే కాకుండా, ఇది మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది,. కాబట్టి మీరు రోజంతా ఆకలిగా అనిపించదు.
ఇది ఎప్పుడు హానికరం కావచ్చు?
అల్పాహారం కోసం గుడ్లు. బ్రెడ్ తినడం కొన్నిసార్లు హానికరమైన పరిస్థితులకు దారి తీయవచ్చు. ఉదాహరణకు, మీరు క్యాలరీలు ఎక్కువగా, ఫైబర్ తక్కువగా ఉండే సాధారణ బ్రెడ్ తింటే.. బరువును పెరగవచ్చు, అసిడిటీ రావచ్చు. ఇవే కాకుండా, అనేక కడుపు సంబంధిత సమస్యల బారిన పడవచ్చు.
తృణధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్‌ని ఎంచుకోవడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది పెద్ద మొత్తంలో ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను సరిగ్గా ఉంచుతుంది. దాంతో పాటు, బరువు పెరగనివ్వకుండా, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్, గుడ్లు తినండి. కానీ రెండు రొట్టెల కంటే ఎక్కువ తినడం అంత మంచిది కాదు. ఇందులో కూడా తృణధాన్యాలతో చేసిన బ్రెడ్‌ను ఎంచుకోవడం ఉత్తమం.