నీలాంబ‌రి పాత్రను మిస్ చేసుకున్న ఇద్దరు హీరోయిన్లు

కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన చిత్రం నరసింహ. తమిళ్ లో పడయప్పాగా 1999 లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా రమ్యకృష్ణ నటించిన నీలాంబారి పాత్ర సినిమాకే బిగ్గెస్ట్ హైలెట్ గా నిలిచింది. అయితే కెరీర్ బిగినింగ్ లో ఇంతటి నెగిటివ్ రోల్ చేయడానికి రమ్యకృష్ణ సహాసమే చేశారని చెప్పాలి.

అయితే ఈ పాత్ర కోసం ముందుగా ద‌ర్శకుడు కే.ఎస్ ర‌వికుమార్ హీరోయిన్ మీనాను అనుకున్నార‌ట‌. కానీ తనకు నెగిటివ్ రోల్ సెట్ కాద‌ని ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసింద‌ట‌. ఆ త‌ర‌వాత హీరోయిన్ న‌గ్మాను సంప్రదించార‌ట‌. అయితే న‌గ్మా అప్పటికే వ‌రుస సినిమాలతో బిజీగా ఉండటంతో చేయలేనని చెప్పిందట. దీంతో చివరకు రమ్యక‌ృష్ణకు ఆపాత్ర దక్కింది. ఆ పాత్రకు రమ్యక‌ృష్ణ వంద‌కు వంద శాతం న్యాయం చేసింది.

అయితే ఈ మూవీలోని నీలాంబరి రోల్ చేయడం నాకు ఇష్టం లేదని రమ్యకృష్ణ వెల్లడించారు. దర్శకుడు పాత్రను ఎంచుకునే అవకాశం ఇచ్చి ఉంటే సౌందర్య రోల్ ను తాను ఎంచుకునేదానినని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. కానీ దర్శకుడు ఆ విధంగా అడగలేదని తెలిపింది. సౌందర్య ముఖంపై కాలు పెట్టే సీన్ లో నటించడానికి తాను ఎంతగానో ఇబ్బంది పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో రజినీ తల్లిగా నటించిన లక్ష్మి గతంలో రజినీకి హీరోయిన్ గా నటించింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here