శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన చిత్రం ఫిదా. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించాడు. 2017జూలై 21 విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని డైలాగులు, పాటలు సినిమాకు బిగెస్ట్ హైలెట్ గా నిలిచాయి. ఇక వరుణ్ తేజ్, సాయి పల్లవి నటన సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది.
అయితే ఈ సినిమాను ముందుగా వరుణ్ తేజ్, సాయి పల్లవిలతో తీయాలని శేఖర్ కమ్ముల అనుకోలేదట. మొదట మహేష్ బాబుకు కథ వినిపించారట శేఖర్. ఆయనకు స్టోరీ చాలా నచ్చిందట. సినిమాలో కొన్ని మార్పులు కూడా చెప్పారట. మహేష్. ఇక మహేశ్‌కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునేను అనుకున్నాడట. మహేశ్‌కు ఈ కథ విపరీతంగా నచ్చడంతో భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశాడట. అన్నీ ఓకే అనుకునే సమయానికి మహేశ్‌కు డేట్స్ కుదరలేదట. దీంతో ఈ సినిమాను చేయలేనని చెప్పారట
దీంతో వారి ప్లేస్ లో వరుణ్ తేజ్, సాయి పల్లవిలను తీసుకుని ఈ సినిమాను తెరకెక్కి్ంచారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా సాయి పల్లవిని ఎక్కడికో తీసుకువెళ్లిందనే చెప్పాలి. సాయిపల్లవి లేకుండా ఈ సినిమాను ఆడియెన్స్ అస్సలు ఊహించుకోలేరు. అంతలా ఆమె క్యారెక్టర్ ఆకట్టుకుంది. ఈ హీరోయిన్ సొంత డబ్బింగ్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఒకవేళ మహేష్, దీపికా పదుకునే ఈ సినిమా చేసుకుంటే ఎలా ఉండేదని నెట్టింట చర్చ జరుగుతుంది.