మందమర్రిలో ఆరుగురు సజీవ దహనం.. రకుల్​ ప్రీత్​సింగ్​, రోహిత్​ రెడ్డికి ఈడీ నోటీసులు.. ప్రధానితో కోమటిరెడ్డి ఏం మాట్లాడారు.. టుడే టాప్​ న్యూస్​

రకుల్​ ప్రీత్​సింగ్​కు ఈడీ నోటిసులు

అయిదేండ్ల కిందట సంచలనం రేపిన టాలీవుడ్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. నటి రకుల్‌‌‌‌‌‌‌‌ ప్రీత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌కు ఈ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే కేసులో రకుల్​కు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది మూడోసారి. గత ఏడాది సెప్టెంబరు 6న కూడా విచారణకు నోటీసులు పంపింది. ఆమెకు ముందస్తుగా ఖరారైన షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ఉండడంతో హాజరు కాలేదు. రాష్ట్ర ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ పోలీసులు అప్పట్లో నమోదు చేసిన డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ కేసు ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీలో కలకలం రేపింది. దాదాపు 12 మంది సినీ ప్రముఖులను అప్పట్లోనే విచారించింది.

రోహిత్​రెడ్డికి ఈడీ నోటీసులు

ఎమ్మెల్యేల ఫామ్​ హౌజ్​ కేసుతో రాష్ట్రమందరికి పరిచితుడైన తాండూరు ఎమ్మెల్యే పైలెట్​ రోహిత్​రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్  చట్టం కింద శుక్రవారం ఈడీ సమన్లు జారీ చేసింది. 19న హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసులో హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ అడిషనల్ డైరెక్టర్ దేవేందర్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌ దాదాపు 12 పేజీల నోటీసును రోహిత్​కు సర్వ్ చేశారు. రోహిత్‌‌‌‌ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేరి ట ఉన్న కంపెనీలు, వాటికి సంబంధించిన ఆదాయ వ్యయాలు, బ్యాంకు ఖాతాలు, బ్యాలెన్స్‌‌‌‌ షీట్ల వివరాలను తమకు తెలియజేయాలని సమన్లు జారీ చేసింది. వివిధ కంపెనీల అకౌంట్లకు నిధులు మళ్లించిన అభియోగాలపై ఈడీ రోహిత్​రెడ్డిని విచారించనుంది.

పాలేరు నుంచి పోటీ చేస్తానన్న షర్మిల

తాను పాలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వైఎస్సార్ టీపీ అధినేత్రి ​షర్మిల ప్రకటించారు. ఖమ్మం రూరల్​ మండలం కరుణగిరిలో పార్టీ పాలేరు సెగ్మెంట్ ఆఫీస్​కు విజయమ్మతో కలిసి శుక్రవారం ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ వైఎస్ రాజశేఖర్​రెడ్డి పాలనను తీసుకొస్తానని అన్నారు. గడపగడపకూ వైఎస్సార్ ​సంక్షేమ పాలనను అందిస్తానని, ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటానని అన్నారు.

మోడీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు ఆయన ప్రధానితో మాట్లాడారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపింది. భేటీ అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన, విజయవాడ హైదరాబాద్ రహదారి పనులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు అభివృద్ధి పనుల సాధన అంశాలపై ప్రధానితో చర్చించినట్లు తెలిపారు. రాజకీయ అంశాలను దాటవేశారు. ఏ పార్టీ నుంచి తాను పోటీ చేయాలనేది ఎన్నికలకు ఒక నెల రోజుల ముందు ప్రకటిస్తానని అన్నారు. నల్గొండ నుంచి ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తానన్నారు.

సెస్​ తగ్గిస్తే పెట్రోల్​ రూ.70 కే ఇస్తాం: కేటీఆర్​

కేంద్రం సెస్​ తొలగిస్తే పెట్రోల్ 70 రూపాయలకు, డీజిల్ 60 రూపాయలకే అందిస్తామని మంత్రి కేటీఆర్​ ట్వీట్ చేశారు. కేంద్రం విధించిన సెస్​ వల్ల రాష్ట్రానికి రావాల్సిన 41 శాతం ట్యాక్స్​లో వాటాను కోల్పోయామని పేర్కొన్నారు. సెస్​ రూపంలో వసూలు చేస్తున్న రూ.30 లక్షల కోట్లు కేంద్రానికి సరిపోవటం లేదా.. అని ప్రశ్నించారు. తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలపై వాట్​ తగ్గించలేదని కేంద్రం చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్​లో ట్వీటర్​లో ఘాటుగా ఈ సమాధానమిచ్చారు.

మందమర్రిలో విషాదం.. ఆరుగురు సజీవదహనం

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో విషాదం చోటు చేసుకుంది. గుడిపెల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. మాసు శివయ్య సహా ఆయన కుటుంబానికి చెందిన వారందరూ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు. శివయ్య (50) ఆయన భార్య రాజ్యలక్ష్మి, శివయ్య వదిన కూతురు మౌనిక (35), నాలుగేండ్ల హిమబిందు, రెండేండ్ల వయస్సున్న స్వీటీ, శివయ్య బంధువు శాంతయ్య మృతి చెందారు. కోటపల్లి మండలం కొండంపేట గ్రామానికి చెందిన మౌనిక మూడు రోజుల కిందటే శివయ్య ఇంటికి వచ్చి ఈ ప్రమాదంలో బలైంది. మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్ సంఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించారు. ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పించినప్పటికీ.. అప్పటికే అయిదుగురు చనిపోయారు. అసలు ప్రమాదమెలా జరిగిందనేది పోలీసులు విచారణ చేస్తున్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here