ఈ 10 ఆహారాలను పచ్చిగా తింటే ఆరోగ్యం తథ్యం

దోసకాయ

దోసకాయలను తీసుకోవడం వల్ల పూర్తి స్థాయి రుచితో పాటు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. దీంతో పాటు ఆలివ్ ఆయిల్, ఉప్పు కలిపి చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు.

బచ్చలికూర

బచ్చలికూరలో విటమిన్ సి, ఇ, ఫైబర్, ఎంజైమ్స్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని కూరగా తినడం కంటే పచ్చిగా తింటేనే ఎక్కువ ఫలితంగా ఉంటుంది. కూరగా వండి తింటే అమైనో ఆమ్లాలు కోల్పోయే అవకాశం ఉంది.

బీట్ రూట్

బీట్ రూట్ ను పచ్చిగా తీసుకోవడం వల్ల కణాల పెరుగుదల, మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది.

మొలకలు

మొలకలలో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే ఫైటో న్యూట్రియెంట్స్, క్లోరోఫిల్ అధికంగా ఉంటాయి. వీటిని పచ్చిగా తీసుకుంటే విటమిన్ సి, బి కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది.

క్యారెట్

వండిన క్యారెట్ తో పోలిస్తే పచ్చి క్యారెట్ లో ఎక్కువ పోషక విలువలుంటాయి. ఇది శరీరంలో శక్తి స్థాయిలను పెంచడంతో పాటు కళ్లకు కూడా ఆరోగ్యకరంగా పనిచేస్తుంది.

టమాటో

పచ్చి టమాటోలు తీసుకోవడం వల్ల ఊబకాయం, క్యాన్సర్, మధుమేహం, మూత్రపిండాల్లో రాళ్లు, ఎముకల నష్టం, క్యాన్సర్ వంటి అనేక అనారోగ్యాల సమస్యలను తప్పించుకోవచ్చు.

ఉల్లిపాయ

ఉల్లిపాయలలో సల్ఫర్ సమ్మేళనాలు, క్యాన్సర్ నివారణ పదార్ధాలు చాలా ఉంటాయి. ఉల్లిపాయల్లోని రసాయనాల కారణంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉంటుందని చాలా మంది నమ్ముతారు.

బ్రోకలీ

ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఒకటి బ్రోకలీ. దీన్ని పచ్చిగా కూడా తినవచ్చు. ఒకవేళ అలా ఇష్టం లేకపోతే దీన్ని తినేముందు ఒక నిమిషంపాటు వేయించండి. అతిగా ఉడకకుండా జాగ్రత్త వహించండి.

వెల్లుల్లి

వెల్లుల్లిని ఉడికించకుండా తినడం ద్వారా క్యాన్సర్ లక్షణాల నుంచి దూరంగా ఉండవచ్చు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here