జామున్ అనగానే చాలా మందికి చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లముందు నిలుస్తాయి. వేసవిలో ఈ పండ్లు తింటే అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మధుమేహాన్ని నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
డయాబెటిస్ లో జామున్ ఆరోగ్య ప్రయోజనాలు :
కాలా జామున్, జావా ప్లమ్ అనేవి వేసవిలో దొరికే సరైన పండ్లు. జామున్ అనే పదం ప్రతి ఒక్కరికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. జామున్లను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి నోటికి రుచిగా ఉంటాయి. అంతే కాదు ఇవి చాలా ఆరోగ్యకరమైనవి కూడా.
ఇందులో ఉండే ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాలిష్యం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ B6 లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ పెంచడానికి ఇవి చాలా ఉపయోగపడుతాయి. దీంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా ఇవి మెరుగుపరుస్తాయి. వీటికి తోడు ఇవి జీర్ణ లక్షణాలను పెంచుతాయి.
ప్రతి రోజు జామున్ ని తినడం వల్ల ఇన్సులిన్ చర్యను మెరుగుపరుస్తుంది. మధుమేహం రాకుండా కూడా సహాయపడుతుంది. జామున్ ఎక్కువ గా తినడం వల్ల రక్తంలో చెక్కరను తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటిని పెంచుతుంది. జామున్ లో అధిక ఆల్కలాయిడ్ కంటెంట్య.. హైపరగ్లైసిమియా, అధిక రక్తంలో చెక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. పండుతో పాటు, ఈ చెట్టు విత్తనాలు, ఆకులు, బెరడు నుంచి సేకరించి పదార్దాలు సైతం శరీరంలోని రక్త చక్కెరలను తగ్గించడంలో సహాయపడతాయి.
జామున్ ను అనేది విధాలుగా తినవచ్చు :
వీటిని పచ్చిగా తినవచ్చు. లేదంటే వాటి రసాన్ని తీసి కూడా తాగవచ్చు. దీన్ని సలాడ్ లు, జాములు లాంటి వాటిల్లోనూ విరివిగా ఉపయోగించవచ్చు. కాస్త ఓపిక ఉన్న వారు చక్కగా పొడిగా తయారు చేసుకుని తినవచ్చు.