ఉసిరి రసం తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల ఎన్ని ప్రయోజనాలయితే ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి రసం తాగడం వల్ల కలిగే నష్టాలు :
ఉసిరి రసం తాగడం వల్ల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జుట్టు, చర్మం సమస్యలను తొలగించడంలోనూ ఉసిరి రసం సహాయపడుతుంది. ఉసిరి వల్ల లాభాలే కాదు.. కొన్ని సందర్భాలలో ఇది ఆరోగ్యానికి చాలా హానికరంగా కూడా పరిగణింపబడుతుంది. అయితే ఎలాంటి వ్యక్తులు ఈ ఉసిరి రసం తాగకుండా ఉండాలో ఇప్పుడు చూద్దాం.
ఉసిరి రసం ఎప్పుడు తాగకూడదంటే..
- కాలేయ సంబంధిత సమస్యలకు..
ఉసిరి రసం అనేక కాలేయ సంబంధిత పరిస్థితులకు చాలా హానికరం. విటమిన్ సి, అధిక ఆమ్ల స్వభావం, కాలేయ గాయం, నొప్పిని తీవ్రతరం చేస్తుంది. దీని వల్ల కాలేయ దెబ్బతినడం, లివర్ సిరోసిస్ వంటి నష్టాలు కలుగుతాయి. దాని కంటే ముందు ఉసిరి రసం తాగడానికి ముందు డాక్టర్ సలహా తీసుకోండి.
- మూత్రపిండాలపై ఉసిరి దుష్పభావాలు
ఉసిరి రసం తాగాడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యల రావచ్చు. ఈ రసం మూత్రవిసర్జన లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది మూత్రపిండాల వ్యాధులు, కణజాలాలను దెబ్బతీసే బయోయాక్టివ్ పదార్దాలను కలిగి ఉంటుంది.
- తక్కువ బీపీలో ఉసిరి రసం
అధిక బీపీ ఉన్నవారికి ఉసిరికాయ చాలా ఉపయోగ పడుతుంది. ఇది తక్కువ బీపీ ఉన్నవారికి చాలా హానికరం. ఇది రక్త పోటును తగ్గించడానికి, నిర్వహించడానికి సహాయపడుతుంది. తక్కువ బీపీ ఉన్నవారు ఉసిరి రాసాన్ని ఎక్కువగా తాగడం మంచిది కాదు.
- గర్భధారణ సమయంలో ఉసిరి పరిణామాలు
ప్రెగ్నెన్సీ సమయంలో ఉసిరి కాయ రసం తాగడం ఆరోగ్యనికి చాలా హానికరం. ఇది అమలత్వం, పుల్లని త్రేనుపును పెంచడంలో సహాయపడుతుంది. ఇది మూత్రవిసర్జన వంటి లక్షణాలను సమృద్ధిగా ఉండి, మూత్రం పెంచుతుంది. ఫలితంగా ఇది నిర్జలీకారణానికి దారితీస్తుంది. ఈ పరిస్థితుల్లో ఉసిరి రసం తాగడం మానుకోవడం ఉత్తమం.