దశరథ్ దర్శకత్వంలో నితిన్, నిఖిత హీరోహీరోయున్లుగా 2003లో వచ్చిన చిత్రం సంబరం. దర్శకుడు తేజ తన సొంత నిర్మాణ సంస్థ చిత్రం మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా ఆర్. పి. పట్నాయక్ సంగీతాన్నందించారు.
కులశేఖర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు. బాల్య స్నేహితులైన రవి,గీతల మధ్య ప్రేమని ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కించారు దశరథ్. ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది.
ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రను పోషించారు ఎస్పీ కృష్ణారెడ్డి. ఎన్నో హిట్ క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఈ సినిమాలో ఓ సీరియస్ పాత్రలో కనిపించారు. వాస్తవానికి ఈ పాత్రకు ముందుగా దర్శకుడు దశరథ్.. ఆర్ నారయణ మూర్తిని అనుకున్నారట. ఆయన కూడా చేస్తానని చెప్పారట.
అయితే ఆ టైమ్ లో ఆర్ నారయణ మూర్తి హీరోగా నటించిన ఓ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ కావడంతో ఆయన తన అఫీసుకు వచ్చి ప్రేక్షకులు తనను ఇంకా హీరోగా చూడాలని అనుకుంటున్నారని, ఈ పాత్ర చేయనని చెప్పి దండం పెట్టి వెళ్లిపోయారని ధశరథ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తన మొదటి సినిమా సంతోషం సినిమాకు ఎంత కష్ట పడ్డానో ఈ సినిమా కోసం అంతే కష్టాపడ్డానని ధశరథ్ చెప్పారు. దీంతో ఆయన ప్లేసులో ఎస్పీ కృష్ణారెడ్డిని తీసుకున్నామని చెప్పారు.