మహేష్ బాబు హీరోగా తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం నిజం. ఇందులో మహేష్ బాబు సరసన రక్షిత హీరోయిన్ గా నటించింది. గోపిచంద్ విలన్ గా నటించాడు. 2003 జూన్ 23న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ప్లాప్ కు కారణం ఒక్కడు చిత్రమేనని చెప్పాలి.
ఒక్కడు సినిమాలో మహేష్ ను మాస్ యాంగిల్ లో చూసేసిన ప్రేక్షకులు.. నిజం సినిమాలో అంత అమాయకుడి పాత్రలో మహేష్ ను యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇదే సినిమాను మహేష్ తో కాకుండా ఉదయ్ కిరణ్ లాంటి అప్ కమింగ్ హీరోలతో చేస్తే హిట్ అయిదన్నారు దర్శకుడు తేజ. అయితే ఈ సినిమాలో ACP ఖలీద్ గా ప్రకాష్ రాజ్ గా విలక్షణమైన నటనను కనబరిచారు.
ముందుగా ఈ పాత్ర కోసం సీనియర్ నటుడు మురళీ మోహన్ ను తీసుకున్నారు. సుమారు 70 శాతం చిత్రీకరణ జరిపారు. కానీ రషెన్ చూసిన తర్వాత ఆయన ఆ పాత్రకు సరిపోరని భావించి ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. ఇది తనను అవమానించడమేనని మురళీ మోహన్ ఫిల్మ్ ఛాంబర్ లో పరువునష్టం దావా వేశారు. చివరికి సినీ పెద్దల సమక్షంలో ఈ గొడవ ముగిసింది.
ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ తనకు లాభాలే తెచ్చిందని దర్శకుడు తేజ అన్నారు. ఈ సినిమాలో నటనకు గానూ హీరో మహేష్ బాబు, ఉత్తమ సహయ నటికి గానూ తాళ్ళూరి రామేశ్వరి నంది అవార్డులు అందుకున్నారు. ఈ సినిమాలో అన్ని పాటలు పాడి తప్పు చేశానని సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.