మండు వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు

వేసవి వచ్చేసింది! ఈ మండే వేడిలో ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలా అని అన్వేషిస్తున్నారా. అలాంటి వారి కోసం ఓ చెన్నై ఫుడ్ బ్లాగర్, డిజిటల్ సృష్టికర్త, రజనీ రామ్ (@rajjos.kitchen) ఈ వేసవిలో ఫాలో కావాల్సి కొన్ని ఆహార అలవాట్లను ఈ విధంగా పంచుకున్నారు.

  • వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. మీ ఇంట్లో మట్టి కుండ ఉంటే, దానిని ఎప్పుడూ నీటితో ఉండేలా ఉంచండి. ఖుస్ ఖుస్ వంటి మూలికలను అందులో వేయండి. ఆ తర్వాత సిప్ చేయండి. రిఫ్రిజిరేటెడ్ వాటర్ కంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
  • మీరు నీరు కాకుండా ఇతర పానీయాలను తీసుకుని కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. లేత కొబ్బరి నీరు, చెరుకు రసం, ఇతర తాజా పండ్ల రసాలు వంటి సహజ పానీయాలను అనారోగ్యాన్ని దరి చేరనీయవు.
  • షికంజీ అనేది నిమ్మరసం, ఉప్పు, పంచదార, వేయించిన జీలకర్ర వంటి మసాలా దినుసులతో తయారుచేసిన వేసవి పానీయం. ఈ వేసవిలో సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో ముందుండే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంటను తగ్గించడంలో ఈ పానీయం సహాయపడుతుంది.
  • చాలా మంది టీ లేదా కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఈ వేడి పానీయాలకు బదులుగా లేత కొబ్బరి నీళ్లతో మీ రోజును ప్రారంభించేందుకు ప్రయత్నించండి. ఇందులో ఖచ్చితమైన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇవి శరీరంలో డిటాక్స్ లాగానూ పనిచేస్తుంది.
  • వేసవిలో సోడాలు, ఎరేటెడ్ పానీయాలకు బై చెప్పడం మంచిది. బదులుగా ఆమ్ పన్నాను తీసుకోండి. ఇది పచ్చి మామిడితో చేసే పానీయం. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.. దాంతో పాటు జీర్ణక్రియలోనూ సహాయపడుతుంది.
  • మీ ఆహారంలో పెరుగును చేర్చుకోండి. ఇది వేసవిలో ఎసిడిటీ, గ్యాస్‌ను రానివ్వకుండా చూస్తుంది.
  • సబ్జా గింజలు ఈ వేసవి ఫుడ్ లిస్ట్ లో చేర్చాల్సిన ముఖ్యమైన పదార్థం. ఇది ఇన్‌స్టంట్ కూలర్‌గా పనిచేయడమే కాకుండా ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • గులాబీ రేకులు, పంచదార, యాలకుల నుంచి తయారైన గుల్కంద్.. చర్మంపై ఏర్పడే పగుళ్లను నివారిస్తుంది. వేసవి అంతా మెరుసేలా చూస్తుంది
  • జొన్నలు.. ఇది గ్లూటెన్-రహిత, ప్రొటీన్-రిచ్ మిల్లెట్. ఇందులో విటమిన్ బి1, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ వేసవి బెస్ట్ డెమిడీ ఇది. దీనితో పలు వంటకాలూ చేసుకోవచ్చు.
  • వేసవిలో జిడ్డు, మసాలా, రిచ్ ఫుడ్ కు దూరంగా ఉండండి. ఇది ఎసిడిటీకి, ఉబ్బరానికి దారితీస్తుంది.
  • పొట్లకాయ, బీరకాయ, దోసకాయ వంటి కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోండి. వీటిలో తగినంత నీరు, పోషకాలు ఉంటాయి. వేసవిలో ఇవి డీ హైడ్రేషన్ నుంచి రక్షిస్తాయ్.
  • పుచ్చకాయ, కస్తూరి పుచ్చకాయ, మామిడి వంటి వేసవి పండ్లను తీసుకోండి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc