గోపిచంద్ కథానాయకుడిగా, రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కి్న చిత్రం యజ్ఞం. ఈతరం ఫిలింస్ బ్యానరుపై పోకూరి బాబురావు ఈ చిత్రాన్ని నిర్మించగా, మణిశర్మ సంగీతం అందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు. యాక్షన్ ఫ్యాక్షనిజం నేపథ్యంలో కథ నడుస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో గోపి చంద్ హీరోగా తెలుగు ఇండస్ట్రీ లో సెటిల్ అయిపోయాడు.
అయితే ఈ సినిమా స్టోరీని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేద్దామని నిర్మాత పోకూరి బాబు రావు అనుకున్నారట. అయితే దర్శకుడు సీనియర్ అయితే చేద్దామని ప్రభాస్ తండ్రి సూర్యనారయణ చెప్పారట. కానీ రవికుమార్ చౌదరితోనే ఈ సినిమాను చేయాలని పోకూరి గట్టిగా అనుకున్నారట. దీంతో గోపిచంద్ వద్దకు ఆఫర్ వెళ్లిందట. ఈ విషయాన్ని పోకూరి బాబు రావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
పోకూరి బాబు రావు, హీరో గోపిచంద్ వాళ్ల నాన్న టి కృష్ణ ఇద్దరు మంచి స్నేహితులు. ఈతరం ఫిలింస్ బ్యానరుపై చాలా సినిమాలు తెరకెక్కించారు. ఇక ముందుగా హీరో అవుతాను అంటే గోపిచంద్ ను ముందుగా ఎంకరేజ్ చేయలేదట పోకూరి బాబు రావు. కానీ చివరకు పోకూరి బాబు రావు నిర్మించిన యజ్ఞం చిత్రంతోనే గోపిచంద్ హీరోగా స్థిరపడిపోయాడు.