రామ్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం జగడం.. 2007 మార్చి 16న విడుదలై ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. అయితే ఈ సినిమాను ఒక హీరో కోసం అనుకుని మరో హీరోతో తెరకెక్కి్ంచారు సుకుమార్. ఇంతకీ ఆ హీరో ఎవరో చూద్దాం.
ముందుగా మహేశ్‌బాబును ఊహించుకుని సుకుమార్ ఆ స్టోరీని రాశారట. కానీ అది సాధ్యపడకపోవడంతో తన మొదటి సినిమా హీరో అల్లు అర్జున్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని సుకుమార్ అనురకున్నారట. చివరికీ అదీ కూడా వీలుపడలేదుట. ఈ కథపై నిర్మాత దిల్ రాజు అభ్యతరం వ్యక్తం చేయడంతో తనకు కోపం వచ్చిందట.
దీంతో సుకుమార్ రాత్రికి రాత్రే హీరో రామ్‌ను కలిసి, కథ చెప్పారట.. అంతేకాకుండా మరుసటి రోజునే సినిమాని ప్రారంభించా. దాని ఓపెనింగ్‌కు బన్నీని, నిర్మాత దిల్ రాజుని ఆహ్వానించారట సుకుమార్. కోపం వస్తే ఇలా చేసేస్తావా? అని దిల్ రాజు, బన్నీ తనని అడిగారని చెప్పాడు. అప్పుడు తనది అమాయకత్వమని కొన్నాళ్లకు అర్థమైందన్నారు. ఆ చిత్రం ఫ్లాప్ అవడంతో తనలో మార్పొచ్చిందని సుకుమార్ వివరించారు. ఆ సినిమాలో రామ్ అద్భుతంగా నటించాడని చెప్పుకొచ్చారు.
ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో ఆర్య, ఆర్య2, పుష్ప చిత్రాలు వచ్చాయి. పుష్ప 2 షూటింగ్ జరుపుకుంటుంది.