బిచ్చగాడు సినిమాను మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవరు?

విజయ్‌ ఆంటోని హీరోగా శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పిచ్చైకారన్‌. తెలుగులో బిచ్చగాడు పేరుతో విడుదలైన ఈ సినిమా ఇక్కడా ఘన విజయం అందుకుంది. అనారోగ్యానికి గురైన తల్లి క్షేమం కోసం కోటీశ్వరుడు.. బిచ్చగాడిలా మారడమనే కాన్సెప్ట్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న బిచ్చగాడు 2 ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం

పిచ్చైకారన్‌ తమిళ్ లో సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయాలనుకున్న దర్శక, నిర్మాతలు అనుకున్నారు. ఇందులో హీరోగా శ్రీకాంత్‌ ను అనుకుని ఆయనను సంప్రదించారు. అయితే ఈ సినిమా ప్రివ్యూ చూసిన శ్రీకాంత్‌.. కథ బాగా నచ్చడంతో రీమేక్‌లో నటించేందుకు ఓకే చెప్పారు. తమిళ్‌లో ఉన్న సెంటిమెంట్‌ కంటే మరింత ఎమోషన్‌తో తెరకెక్కించాలనుకున్నారు.

అయితే, హీరో రెమ్యునరేషన్‌ ఎక్కువవుతుండడంతో బడ్జెట్‌ పెరిగిపోతుందనే ఉద్దేశంతో మేకర్స్ రీమేక్‌ను వదిలేసి, డబ్బింగ్‌ చేసి సినిమాను విడుదల చేశారు. ఈ విషయాన్ని శ్రీకాంత్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను హీరోగా నటించిన ‘మహాత్మ’ సినిమాకి విజయ్‌ ఆంటోని సంగీత దర్శకుడిగా పనిచేయడంతో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడిందని, ఆ క్రమంలోనే ‘పిచ్చైకారన్‌’ను చూశానని తెలిపారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here