గాంధీ కుటుంబాల ఆకస్మిక మరణాలకు మురారి సినిమాకు లింకేంటీ?

మహేష్ బాబు, సోనాలి బింద్రే హీరోహీరోయిన్లుగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మురారి. రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నందిగం గోపి, రామలింగేశ్వరరావు, ఎన్. దేవిప్రసాద్ సమ్యుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ద్వారా సోనాలి బింద్రే తెలుగు తెరకు పరిచయమయ్యింది. మహేష్ బాబుకు ఇది నాలుగో చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం 2001 ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది.

అయితే ఈ సినిమా కథకు రాజీవ్ గాంధీ హత్యకు చిన్న లింక్ ఉందట. అదేంటంటే.. ఒకసారి దర్శకుడు కృష్ణ వంశీ తన స్నేహితులతో కలిసి ఓ లాంచీలో ప్రయాణిస్తుండగా.. ఆ లాంచీలో అందరూ మాట్లాడుతుండగా సడెన్‌గా సీరియస్ డిస్కషన్ నడిచింది. ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ… ఇలా ఆ ఫ్యామిలీ అంతా ఆకస్మిక దుర్మరణాలే! ఎందుకంటావ్? అని ఆసక్తిగా అడిగాడు కృష్ణవంశీ ఫ్రెండ్ .. అతని ఫ్రెండ్ లో మరోకరు శాపం అని అనేశాడు.

అది విన్న కృష్ణ వంశీ శాపం కారణంగా మనుషులు చనిపోవడం అనే కాన్సెప్ట్ ను ఫ్యామిలీ కథను జోడించి మురారి కథను రాసుకున్నారట కృష్ణ . అలాగే మహేష్ ను చూడగానే కృష్ణుడులా అనిపించిడం, బృందావనం, అప్పటి వాతావరణం అన్ని మైండ్ లో తిరిగాయట. దాంతో మురారి సినిమాకు భాగవతం, భారతంలోని పాత్రలను జోడించారట కృష్ణవంశీ. ఇదే విషయాన్నీ ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here