భద్ర సినిమాలో రవితేజ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ముందుగా అనుకున్నది వీళ్లనే..!

రవితేజ, మీరా జాస్మిన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం భద్ర. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. 12, 2005న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి మరిన్ని భాషల్లో పునఃనిర్మితమైంది.

ఈ సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించాడు దీపక్‌. ఇందులో అతను పోషించిన రాజా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఝాన్సీ, దీపక్‌ కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సీన్లు అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే ముందుగా ఆ పాత్ర కోసం దర్శకుడు బోయపాటి రాజీవ్ కనకాల, హీరో శివాజీలను అనుకున్నరట. అయితే ఆ టైమ్ లో వీరిద్దరూ బీజీగా ఉండటం వలన భద్ర సినిమా కోసం డేట్స్‌ కేటాయించలేకపోయారట.

దీంతో సంపంగి మూవీతో మంచి పేరు తెచ్చుకున్న దీపక్‌ ను సంప్రదించాడట బోయపాటి. భద్రలో రాజా పాత్రలో నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో ఆఫర్ మిస్ చేసుకున్న హీరో శివాజీ బోయపాటి తరువాతి సినిమా తులసీ చిత్రంలో వెంకటేష్ కు బామ్మర్దిగా నటించాడు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here