ఆలీ పక్కన హీరోయిన్ గా చేయనన్న సౌందర్య

ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆలీ హీరోగా తెరకెక్కిన చిత్రం యమలీల. ఇందులో ఆలీ సరసన ఇంద్రజ హీరోయిన్ గా నటించింది. 1994లో రిలీజైన ఈ చిత్రం బాక్స్ఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, గుండు హనుమంతరావు మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ చిత్రం అలీ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాదు అలీ స్టార్‌డమ్‌ను కూడా పెంచింది. అయితే ఈ సినిమాకు ముందుగా హీరోగా ఆలీని తీసుకోవాలని ఎస్వీ కృష్ణారెడ్డి అనుకున్నప్పుడు చాలా మంది వద్దని సలహా ఇచ్చారట ఎస్వీ కృష్ణారెడ్డి. కానీ ఈ కథకు ఆలీని సరిపోతారని కృష్ణారెడ్డి భావించారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా సౌందర్యను తీసుకోవాలని అనుకున్నారట కృష్ణారెడ్డి.

ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే, తొలుత ఒప్పుకొన్నా, ఆ తర్వాత అలీ హీరో అని తెలియడంతో తన తండ్రి సూచన మేరకు ఈ సినిమా నుంచి తప్పుకొన్నారట. దీంతో ఆ తరువాత ఇంద్రజను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో ఆఫర్ మిస్ చేసుకున్నందుకు సౌందర్య చాలా బాధపడ్డారట.

దీంతో ఆలీ పక్కన హీరోయిన్ గా నటించకపోయిన అతన్ని పక్కన ఓ పాటలో యాక్ట్ చేసింది సౌందర్య. అదే శుభలగ్నం సినిమాలో చినుకు చినుకు సాంగ్. ఈ సినిమా కూడా ఎస్వీ కృష్ణారెడ్డిలో తెరకెక్కడం విశేషం.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here