ఒకే రోజున బాలయ్య రెండు సినిమాలు రిలీజ్.. ఒకటి హిట్టు, ఇంకోటి ఫట్టు

ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజున రిలీజ్ కావడం కామాన్. కానీ ఓ స్టార్ హీరో నటించిన సినిమాలు ఒకే నెలలో ఒరోజున విడులవ్వడం అనేది వెరీ రేర్. ఈ విషయం నందమూరి బాలకృష్ణ విషయంలో ఓ సారి ఎదురైంది. బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు చిత్రాలు 1993లో సెప్టెంబర్ 03న రిలీజై సంచలనం సృష్టించాయి. అయితే ఇందులో నిప్పురవ్వ ప్లాప్ అవ్వగా, బంగారు బుల్లోడు సూపర్ హిట్ అయింది.

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిప్పురవ్వ చిత్రం తెరకెక్కింది. ఇందులో బాలకృష్ణ, విజయశాంతి హీరోహీరోయిన్లుగా నటించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాలకృష్ణక ఇదే తొలి 70mm సినిమా. విజయశాంతి, బాలకృష్ణ హిట్ ఫెయిర్ కావడం, మళ్లీ ఈ సినిమాకి విజయశాంతి ప్రొడ్యూసర్ అవ్వడం, వరుస హిట్లతో సక్సెస్ఫుల్ దర్శకుడిగా మంచి పేరున్న కోదండరామిరెడ్డి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను నిప్పురవ్వ చిత్రం అందుకోలేకపోయింది.

కర్తవ్యం లాంటి సూపర్ హీట్‌‌తో ఉన్న విజయశాంతి ఇందులో ఎక్కువగా కామెడీ రోల్‌‌లో కనిపించడం ప్రేక్షకులకి నచ్చలేదు. సినిమా మొదట్లో ఎలుగుబంటిని చూసి భయపడ్డ హీరోయిన్ సినిమా చివర్లో సీరియస్‌‌గా ఫైట్స్ చేయడం విమర్శలకు దారితీసింది. అయితే దీనివెనుక కథ వేరే ఉంది .ఈ సినిమా షూటింగ్ సమయంలోనే విజయశాంతి కర్తవ్యం తమిళ రీమేక్ వైజయంతి ఐపీఎస్ గా రిలీజై సూపర్ హిట్ అయింది. అలాంటిది నిప్పురవ్వ సినిమాలో విజయశాంతి రోల్ కామెడీగా ఉండడంతో దెబ్బతింటామని బయ్యర్లు భయపడ్డారు. అందుకే నిప్పురవ్వ క్లైమాక్స్ లో విజయశాంతితో ఫైట్లు చేయించారు. ఇదే తేడా కొట్టింది.

రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో బంగారు బుల్లోడు సినిమా తెరకెక్కింది. రమ్యకృష్ణ, రవీనా టాండన్ హీరోయిన్లుగా నటించారు. అయితే బాలకృష్ణ తో రమ్యకృష్ణకు ఇది తొలి చిత్రం కాగా రవీనాటాండన్ కి టాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా. జగపతి ఆర్ట్స్ పిక్చర్ పై వి.బి.రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాను తెరకెక్కించారు. గతంలో ఆయన తెరకెక్కించిన దసరా బుల్లోడు, బంగారు బాబు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అందుకే ఈ చిత్రానికి బంగారు బుల్లోడు అనే టైటిల్ ని పెట్టారాయిన. ఈ సినిమాలోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్ అయింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here