‘మా శాంతమ్మే చెయ్యాలి’.. విజయశాంతి డేట్స్ కోసం వెయిట్ చేసిన స్టార్ డైరెక్టర్

హీరోయిన్ విజయశాంతి సినీ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా ‘ప్రతిఘటన’. టి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1986లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థపై రామోజీరావు ఈ సినిమాను నిర్మించగా కె. చక్రవర్తి సంగీతాన్ని అందించారు.

ఈ చిత్రంలో విజయశాంతితో పాటు చంద్రమోహన్, రాజశేఖర్, చరణ్‌ రాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి మూడు నంది పురస్కారాలు లభించాయి, ఉత్తమ నటిగా విజయశాంతి, ఉత్తమ గాయనిగా ఎస్‌.జానకి, ఉత్తమ మాటల రచయితగా హరనాథరావుకు అవార్డులను అందుకున్నారు. అయితే దర్శకుడు టి. కృష్ణ ఈ కథను రాసుకున్నప్పుడు ప్రధాన పాత్రను విజయశాంతి చేతనే వేయించాలనుకున్నారట.

అయితే ఈ చిత్రంలో నటించడానికి విజయశాంతికి దగ్గర డేట్స్ లేవంట. కానీ దర్శకుడు టి. కృష్ణ ఈ చిత్రాన్ని మా శాంతమ్మే చెయ్యాలి అని పట్టుబట్టడంతో ఇతర చిత్రాల నిర్మాతలతో మాట్లాడి ఈ సినిమా కోసం సమయాన్ని కేటాయించగలిగిరాట విజయశాంతి. ఈ సినిమాని నెలరోజులలో పూర్తి చేశారు కృష్ణ. కన్నడ సినిమాల్లో అప్పటిదాకా కథానాయకుడి పాత్రల్లో నటిస్తున్న చరణ్‌రాజ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించడానికి అంగీకరించాడు.

సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం హీరోయిన్ విజయశాంతి సినీ కెరీర్ ను ఒక్కసారిగా మలుపుతిప్పింది. స్టార్ హీరోలతో సమానంగా ఆమెకు క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తరువాత విజయశాంతితో లేడీ ఓరియెంటెండ్ కథలను దర్శకులు సిద్దం చేసుకున్నారు.

ఇక సంచలన సినీ దర్శకుడిగా తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఏలుతున్న రోజుల్లోనే దర్శకుడు టి. కృష్ణ కేన్సర్‌ వ్యాధికి గురై . మూడు నెలలపాటు అమెరికాలో చికిత్స కూడా పొందారు. అయినా ఆ వ్యాధి తగ్గలేదు. చెన్నై అపోలో ఆస్పత్రిలో ఇరవై రోజులపాటు చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. 1986 అక్టోబరు 21న అభిమానులను, ఆత్మీయులను దుఃఖసాగరంలో ముంచి తిరిగిరాని దూరతీరాలకు తరలిపోయారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here