రాజశేఖర్, మీనా ప్రధాన పాత్రలలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మా అన్నయ్య. బ్రహ్మజీ, వినీత్, దీప్తి భట్నాగర్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. 2000 వ సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.
ఇప్పటికే ఈ సినిమాను టీవీలో వచ్చిన వదలకుండా చూస్తారు ఆడియన్స్. తమిళ చిత్రం వనాథైపోలాకు ఇది రీమేక్ కాగా ఎస్‌ఏ రాజ్‌కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. అయితే ఈ చిత్రానికి ముందుగా దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యను అనుకున్నారు. రాజశేఖర్, ముత్యాల సుబ్బయ్యలది సూపర్ హిట్ కాంబినేషన్ కావడం, కథ కూడా ఫ్యామిలీ సబ్జెక్ట్ కావడంతో ముత్యాల సుబ్బయ్యను ఈ సినిమాకు తీసుకున్నారు.
నెల రోజుల పాటు దర్శకుడిగా పనిచేసిన తర్వాత ఈ సినిమా మానేయండని రాజశేఖర్ చెప్పారట. ఈ విషయాన్ని ముత్యాల సుబ్బయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఆయన ప్లేస్ లో రవిరాజా పినిశెట్టిని దర్శకుడిగా తీసుకున్నారు మేకర్స్.
రాజశేఖర్, ముత్యాల సుబ్బయ్యలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన తొలి సినిమా అరుణ కిరణం. ఆ తరువాత అన్న, మనసున్న మారాజు, సూర్యుడు సినిమాలను రాజశేఖర్ తో తెరకెక్కించారాయన.
మొత్తం తన కెరీర్ లో 51 సినిమాలు చేసిన ముత్యాల సుబ్బయ్య.. చివరగా ‘ఇదేం ఊరురా బాబు’(2001) అనే చిత్రాన్ని చేశారు కానీ అది విడుదల కాలేదు. అందులో ఆకాశ్, ప్రత్యూష హీరో, హీరోయిన్లుగా నటించారు.