ఒక్క ఫైట్ లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ నుండి ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. ఆ సినిమా నుంచి యాక్షన్ సన్నివేశాలు, పంచ్ డైలాగులు, పాటలు, ఆ పాటలకి బాలయ్య అదిరిపోయే స్టెప్పులు ఉండాలని వారు అనుకుంటారు.కానీ ఒక్క ఫైటు లేకుండా, ఒక్క స్టెప్పు లేకుండా బ్లాక్‌‌బస్టర్ హిట్‌‌ను కొట్టి బాక్స్ ఆఫీస్‌‌ని షేక్ చేశారు బాలయ్య. అది కూడా ఓ ఫ్యామిలీ మూవీతో.. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే నారీ నారీ నడుమ మురారి.

అయితే ఈ మూవీ అంత పెద్ద సక్సెస్ కావడానికి కారణాలు మెయిన్‌‌గా రెండే రెండు… ఒకటి బాలయ్య నటన కాగా, రెండోది కథ… అత్తాఅల్లుళ్ళ టీజింగ్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమాకి ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథను అందించారు. ఇందులో బాలకృష్ణ సరసన శోభన, నిరోషా హీరోయిన్స్‌‌గా నటించారు.

వీరికంటే ముందుగా భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ, సీతను హీరోయిన్లుగా అనుకున్నారు .యువచిత్ర పతాకం పై నిర్మాత మురారి ఈ సినిమాని తెరకెక్కించారు. బాలయ్యతో ఆయనకిది రెండో సినిమా.. దీనికి ముందు వీరి కాంబినేషన్‌లో సీతారామ కళ్యాణం అనే చిత్రం వచ్చింది. సినిమా క్లైమాక్స్ సీన్ లో హీరో బాలయ్య దాదాపుగా 22 నిమిషాలు కనిపించకపోవడం విషేశం. ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామికి దర్శకుడు, నటుడు జంధ్యాల డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. ఈ సినిమా 1990 ఏప్రిల్ 27న విడుదలై సూపర్ సక్సెస్ అయింది.

అయితే ఆ ఏడాది బాలయ్య నుండి రిలీజ్ అయిన ప్రాణానికి ప్రాణం చిత్రం విడుదలై ప్లాపై అభిమానులకు కాస్త నిరాశని మిగిల్చగా, నారినారి నడుమ మురారి చిత్రం అభిమానులను ఉత్సాహపరిచింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here