ఆ సినిమా కోసం ఒకే డ్రెస్‌ను రెండేళ్లు వేసుకున్న చిరంజీవి

చిరంజీవి హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం ‘అంజి’. అమ్మోరు చిత్రం తరువాత నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందించారు. మణిశర్మ సంగీతాన్నందించాడు. భారీ అంచనాల మధ్య 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ గ్రాఫిక్స్‌కు మాత్రం ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

1998 లో ప్రారంభమైన ఈ చిత్రం ఆరేళ్ళ సుదీర్ఘకాలంపాటు నిర్మాణం జరుపుకుని 2004 లో విడుదలైంది.

కోడి రామకృష్ణ మొదట్లో చిరంజీవితో ద్విపాత్రాభినయం ప్రధానంగా నడిచే ఓ సినిమాని చేద్దామని అనుకున్నారు. కానీ శ్యాం ప్రసాద్ మాత్రం అమ్మోరును మించిపోయే గ్రాఫిక్ చిత్రం వైపే మొగ్గు చూపాడు. చిరు కూడా గ్రాపిక్స్ చిత్రాన్నే చేద్దామని అనుకున్నారు.

1998లో ప్రారంభమైన ఈ సినిమా అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం, బడ్జెట్ కావలసి వచ్చింది. ఆరేళ్ళ పాటు ఆలస్యమైన ఈ సినిమా 2004 లో విడుదలైంది.

ఒక ఇంటర్వెల్ దృశ్యాలు తీయడానికి సుమారు నెల రోజులు పట్టింది. గ్రాఫిక్స్ పనిని సుమారు ఐదారు దేశాల్లో చేయించారు. ఇందులో కీలకమైన ప్రతినాయకుని పాత్రకు మొదటి నుంచే టినూ ఆనంద్ ను ఎన్నుకున్నారు. సినిమా ప్రారంభంలో ఆత్మలింగం కోసం ప్రయత్నించే ఒక మాంత్రికుడు ఉంటాడు. ఈ పాత్ర కోసం ఎల్. వి. ప్రసాద్ ఆసుపత్రి దగ్గర భిక్షాటన చేసే వ్యక్తిని ఎన్నుకున్నారు.

ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ కు జాతీయ పురస్కారం లభించింది.

ఈ చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశం కోసం చిరంజీవి ఒకే షర్ట్ ఉతకకుండా రెండేళ్లు వేసుకోవాల్సివచ్చింది.

ఉత్తమ ఛాయాగ్రహకుడుగా ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు నంది అవార్డు అందుకున్నారు. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా చంద్రరావు కూడా నంది అవార్డు అందుకున్నారు.

చిరంజీవి, హీరోయిన్‌, విలన్‌ తప్పితే మిగిలిన వాళ్లందరూ కొత్తవాళ్లే.

ఈ సినిమా కోసం చిరంజీవి 400 రోజులు డేట్స్ కేటాయించారు. ఈ సినిమా స్టార్ట్ అయి రిలీజ్ అయ్యే లోపు చిరంజీవి నాలుగు సినిమాలు, కోడి రామకృష్ణ 16 సినిమాలు చేశారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here