చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘చూడాలని ఉంది’. చిరు సరసన సౌందర్య, అంజలా జవేరి హీరోయిన్లుగా నటించారు. అశ్వనిదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించగా మణిశర్మ సంగీతాన్ని అందించారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశారు 1998లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాలో రైల్వేస్టేషన్‌లో ఓ లవ్ సీన్ దాదాపు పది నిమిషాలు ఉంటుంది. దీనిని చిరంజీవి, అంజలా జవేరిలపై చిత్రీకరించారు గుణశేఖర్. అయితే ఈ సీన్ చూసిన చిరంజీవి ఇది పవన్ కల్యాణ్ లాంటి హీరోలకు పెట్టాల్సింది అని అన్నారట. అయితే ఈ సీన్ ను తీయడానికి నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు కావాలని నిర్మాత అశ్వనిదత్ ను అడిగారట గుణశేఖర్. దీంతో అశ్వనిదత్ షాకైపోయారట.
ఎందుకంటే అప్పట్లో నాంపల్లి స్టేషన్ పెద్దది. అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. మూడు రోజులు చిరంజీవిగారిని పెట్టుకుని షూట్ చేయడం చాలా కష్టమని చెప్పారట. కావాలంటే సేట్ వేద్దామని చెప్పారట. అయినప్పటికీ గుణశేఖర్ వినలేదట. దీంతో అతి కష్టమ్మీద నాంపల్లి రైల్వేస్టేషన్ అనుమతి లభించిందట. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా చాలా మంది రైళ్లు ఎక్కకుండా స్టేషన్‌లోనే ఆగిపోయారట. ఈ విషయాన్ని గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో చాలాభాగం కలకత్తాలో చిత్రీకరించారు. అక్కడ ఓ బిల్డి్ంగ్ సెట్ వేశారు. ఈ సినిమాలో ” రామ్మా చిలకమ్మా ” అనే పాటను ఎస్పీ బాలుతో పాటుగా ఉదిత్ నారాయణ్ తో కూడా పాటించారు. ఫైనల్ గా ఉదిత్ నారాయణ్ పాటనే సినిమాలో ఉంచారు. ఉదిత్ నారాయణ్ కు తెలుగులో మొదటి పాట ఇదే. ఆ పాట చాలా హిట్ అయిన సంగతి తెలిసిందే.