ఇండస్ట్రీలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన అభిరుచి కలిగిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు నిర్మాత ఎంఎస్ రాజు. భారీ చిత్రాల నిర్మాత, కథల మీద మంచి జడ్జిమెంట్ ఉన్న నిర్మాతగా ఆయనకు పేరుంది. ఎంఎస్ రాజు తండ్రి రాయపరాజు కొన్ని సినిమాలను నిర్మించారు. కృష్ణంరాజు, చిరంజీవి హీరోలుగా ఆయన చిత్రాలను నిర్మించారు. దీంతో ఎంఎస్ రాజుకు కూడా సినిమాలు నిర్మించాలని ఆసక్తి ఉండేది.
ఆ ఉత్సాహంతోనే 1990లో సినిమా నిర్మించే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అలా ఓ చిన్న లైన్ ను అనుకుని దర్శకుడు కోడి రామకృష్ణకు, రచయిత సత్యమూర్తిని కలిశారు. అలా వారి సహకారంతో మొదలైంది శత్రువు సినిమా. అయితే ముందుగా ఈ సినిమాకు హీరోగా శోభన్ బాబును అనుకున్నారట. అయితే ఎంఎస్ రాజు ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో సినిమా ప్లాప్ అయితే రెండు కుటుంబాల మధ్య స్నేహం చెడిపోతుందని అన్నారట. అందుకే సినిమా చేయబోనని చెప్పేసాడట.
దీంతో అప్పటికే బొబ్బలిరాజాతో మంచి హిట్ కొట్టిన వెంకటేష్ తో ఈ సినిమాను ప్లాన్ చేశారట ఎంఎస్ రాజు. కర్తవ్యం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విజయశాంతిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇది ఎంఎస్ రాజుకు బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి. 989 అక్టోబర్ 27న శత్రువు షూటింగ్ చెన్నైలో ప్రారంభం అయింది.కోటి పదిలక్షల బడ్జెట్ తో పూర్తయిన ఈ మూవీ 1991జనవరి 2న విడుదలై సూపర్ హిట్ అయింది.
లాయర్ అశోక్ గా వెంకీ నటన, పోలీసాఫీసర్ గా విజయశాంతి నటన అలరించాయి. ముందుగా విలన్ పాత్రకు కోటకు బదులు కొత్త వాళ్లను తీసుకోవాలని కోడి రామకృష్ణ అనుకున్నారట. చివరికి ఆ పాత్రకు ఎవరూ సెట్ కాకపోవడంతో కోటనే తీసుకున్నారు. రాజ్-కోటి సంగీతం అందించినఈ మూవీ సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.