టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి చిత్రం అతడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, ఆకట్టుకునే ఎలివేషన్స్ తో సినిమా ముందుకు సాగిపోతుంది. మహేష్ కెరియర్ లోనే ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. చాలా తక్కువగా మాట్లాడుతూ సైలెంట్ గా ఉంటూ బాక్సాఫీస్ షేక్ చేశారు మహేష్ బాబు.
వాస్తవానికి ఇది మహేష్ చేయాల్సిన సినిమా కాదు. పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేయాలని ముందుగా త్రివిక్రమ్ అనుకున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కి వెళ్లి కథను వినిపించారు త్రివిక్రమ్. అయితే ఆ సమయంలో కథ వింటూ పవన్ కళ్యాణ్ నిద్రపోయారట. దీంతో అక్కడి నుంచి సైలెంట్ గా వచ్చేసిన త్రివిక్రమ్… మహేష్ బాబు కి వెళ్లి కథను వినిపించారట. మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతడు సినిమా తెరకెక్కింది.
అయితే ఈ సినిమాలో మహేష్ బాబు తాత పాత్రకు ముందుగా శోభన్ బాబుని అనుకున్నారట. నిర్మాత మురళీమోహన్ అయితే ఆయనకు ఏకంగా బ్లాంక్ చెక్కు కూడా పంపించారట. అయితే ఈ ఆఫర్ ని శోభన్ బాబు సున్నితంగా తిరస్కరించారట. దీంతో ఆ ప్లేస్ లో నాజర్ ని తీసుకున్నారు. నాజర్ పాత్రకి ఎస్పీ బాలసుబ్రమణ్యం డబ్బింగ్ చెప్పారు. అత్యధిక డివిడిలు అమ్ముడుపోయిన సినిమాగా అతడు సినిమా రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఆ రికార్డు అతడు చిత్రంపైనే ఉండడం విశేషం.