మహానటిలో కీర్తి సురేష్ కంటే ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరు ?

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం మహానటి. అలనాటి హీరోయిన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మైమరిపించింది. వైజయంతి మూవీస్ రూపొందించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. 2018, 9 మే ఈ చిత్రం రిలీజ్ అయింది. నేటికీ ఈ చిత్రంతో అయిదేళ్ళు పూర్తి అయ్యాయి.

ముందుగా మహానటి చిత్రానికి నటి నిత్యమీనన్ ను హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు నాగ్ అశ్విన్ భావించారు. ఆమెతో చర్చలు కూడా జరిపారు అయితే అది కార్యరూపం దాల్చలేదు. దీంతో తర్వాత ఎంపికగా కీర్తి సురేష్ ని అనుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఈ సినిమాని చేయడానికి కీర్తి సురేష్ ముందుగా భయపడ్డారు. ఈ పాత్రను చేయడానికి గతంలో సావిత్రి నటించిన అనేక చిత్రాలను ఆమె చూసి ఆ తర్వాత ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారు.

ఇక మధురవాణి పాత్రలో సమంత ఓకే చెప్పగా జెమినీ గణేషన్ పాత్ర కోసం ముందుగా సూర్య, మాధవన్ లను అనుకున్నారు నాగ్ అశ్విన్ . ఫైనల్ గా దుల్కర్ సల్మాన్ ను ఖరారు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు నాగచైతన్య నటించి మెప్పించారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ పాత్ర చేయడానికి ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ధైర్యం చేయలేకపోయారు.

సావిత్రి పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ నిత్యమీనన్.. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన కథానాయకుడు చిత్రంలో సావిత్రి పాత్రను పోషించారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here